చలికాలం చర్మం పాడవ్వకుండా ఇలా చేయండి!

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మ సమస్యలన్నీ ఒకేసారి మొదలవుతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగుళ్లు, మంట వంటివి ఈ సీజన్‌లో ఎక్కువ.

Advertisement
Update:2023-10-26 15:36 IST

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మ సమస్యలన్నీ ఒకేసారి మొదలవుతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగుళ్లు, మంట వంటివి ఈ సీజన్‌లో ఎక్కువ. మరి వింటర్‌‌లో ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చలికాలంలో చాలామంది బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు. అయితే అలాంటి ప్రొడక్ట్స్ ఎంచుకునేటప్పుడు వాటిలో ఆల్కహాల్ లేకుండా చూసుకోవాలి. ఆల్కహాల్ ఉన్న లోషన్ల వల్ల రానురాను చర్మం మరింత పొడిబారుతుంది.

చలికాలంలో చర్మం తేమగా ఉండేందుకు వారానికోసారైనా హైడ్రేటింగ్‌ ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటుండాలి. దీనికోసం కలబంద గుజ్జు, టొమాటో, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును వాడుకోవచ్చు. మాస్క్‌ను ముఖానికి అప్లై చేసుకుని పది నిముషాల తర్వాత కడిగేస్తే చాలు.

చలికాలం మేకప్ వేసుకునేముందు నాణ్యమైన మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. దీంతో చర్మం ఇంఫ్లమేషన్‌ బారినపడకుండా ఉంటుంది. అలాగే కంటి మేకప్ కోసం మస్కారా, ఐలైనర్ వంటివి వాడేటప్పుడు వాటర్‌ప్రూఫ్‌ వాటిని ఎంచుకోవాలి. క్లెన్సింగ్ కోసం క్రీమీ లేదా హైడ్రేటింగ్‌ లోషన్స్ ఎంచుకోవాలి.

ఈ సీజన్‌లో పెదవులు తొందరగా పొడిబారుతుంటాయి. కాబట్టి లిప్‌స్టిక్స్‌కు బదులు లిప్ బామ్స్ వాడడం బెటర్. ఇక ఫౌండేషన్‌ విషయానికొస్తే.. గ్లిజరిన్‌ ఉన్న ఫౌండేషన్‌ అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

ఇకపోతే చలికాలం నీటిని తాగడాన్ని మర్చిపోవద్దు. శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటేనే చర్మం కూడా తేమగా ఉంటుంది. అలాగే స్నానానికి మరీ వేడిగా ఉన్న నీటిని వాడొద్దు. అలాచేస్తే.. చర్మం పైపొరల్లో ఉండే నూనె గ్రంధులు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి గోరువెచ్చని నీటితో లేదా చల్లని నీటితో మాత్రమే స్నానం చేయాలి. చలికాలంలో ఆయిల్ ఫుడ్స్ తగ్గించి పండ్లు ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటే చర్మం పాడవ్వకుండా ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News