వింటర్‌‌లో అందమైన పెదవుల కోసం..

చలికాలంలో పెదవులను అందంగా, తేమగా ఉంచుకునేందుకు కొన్ని నేచురల్ టిప్స్ పనికొస్తాయి.

Advertisement
Update:2023-01-20 16:51 IST

వింటర్‌‌లో అందమైన పెదవుల కోసం..

చలికాలంలో పెదవులు ఊరికే పొడిబారుతుంటాయి. కొన్నిసార్లు ఇది మరీ ఎక్కువై పెదవులపై చర్మం పగిలి, రక్తం కూడా వస్తుంటుంది. అయితే చలికాలంలో పెదవులను అందంగా, తేమగా ఉంచుకునేందుకు కొన్ని నేచురల్ టిప్స్ పనికొస్తాయి. అవేంటంటే..

చలికాలంలో పెదవులు పగలకుండా లిప్ బామ్, మాయిశ్చరైజర్ లాంటివి రాసుకోవచ్చు. అయితే వాటికోసం కెమికల్స్‌తో కూడిన ప్రొడక్ట్స్‌ కొనాల్సిన పని లేదు. పెదవులను అందంగా, తేమగా మార్చే నేచురల్ లిప్ బామ్స్ ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

నేచురల్ లిప్ బామ్ కోసం కొన్ని గులాబీ రేకులు తీసుకొని పచ్చిపాలలో కొన్ని గంటలపాటు నానబెట్టి, తర్వాత వాటిని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసుకుని కాసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే పెదవులు సున్నితంగా, అందంగా తయారవుతాయి.

పెరుగు కూడా సహజమైన లిప్ బామ్‌లా పనికొస్తుంది. పగిలిపోయిన పెదవులపై పెరుగు లేదా మీగడ రాసి కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి.

రోజూ కొబ్బరి నూనె లేదా ఆముదంతో పెదవులపై మర్దన చేసినా కూడా పెదవులు పొడిబారకుండా కాపాడుకోవచ్చు. ఆముదంలో గ్లిజరిన్, నిమ్మరసం కలిపితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది.

కీరాదొస పేస్ట్, వెన్న, రోజ్ వాటర్ లాంటివి కూడా నేచురల్ మాయిశ్చరైజర్‌‌గా పనికొస్తాయి. లిప్స్‌ను హైడ్రేటెడ్ గా ఉంచడానికి హల్ప్ చేస్తాయి.

ఈ నేచురల్ లిప్ బామ్స్.. పడుకునేముందు అప్లై చేసుకుని ఉదయాన్నే కడిగేస్తే పగుళ్లు తగ్గుతాయి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కూడా పెదవులు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News