వీళ్లకు హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ!
డయాబెటిస్ హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న మగవాళ్లతో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు 50 శాతం ఎక్కువని స్టడీలు చెప్తున్నాయి.
హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నవాళ్ల సంఖ్య ఈ మధ్య రోజుల్లో బాగా పెరుగుతోంది. ఉన్నట్టుండి వచ్చే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అసలు హార్ట్ ఎటాక్ రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు హార్ట్ ఎటాక్‌కు దారితీస్తాయి. హెల్దీగా ఉన్నవాళ్లతో పోలిస్తే.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
డయాబెటిస్ హార్ట్ ఎటాక్ రిస్క్‌ను పెంచుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న మగవాళ్లతో పోలిస్తే.. డయాబెటిస్ ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు 50 శాతం ఎక్కువని స్టడీలు చెప్తున్నాయి.
ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి మగవాళ్ల కంటే ఆడవాళ్లపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి మానసిక సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది.
కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్లు, ఎలాంటి శారీరక శ్రమ లేనివాళ్లలో గుండెపోటు ప్రమాదం ఉంటుంది.
మెనోపాజ్ తర్వాత ఆడవాళ్లలో ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల కూడా గుండెపోటు ముప్పు పెరుగుతుంది.
గర్భిణిగా ఉన్న టైంలో ఆడవాళ్లలో వచ్చే హైపర్‌టెన్షన్, డయాబెటిస్.. వంటి సమస్యలు ఫ్యూచర్‌లో గుండెపోటుకు కారణమవ్వొచ్చు.
ఒబెసిటీ, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, థైరాయిడ్.. వంటి సమస్యలు కూడా గుండెపోటు ముప్పును పెంచుతాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా చాలామందిలో గుండెపోటు ముప్పు ఉంటుంది.
రకరకాల కార్డియో వాస్కులర్ డిసీజ్‌లకు టొబాకో కూడా ఒక కారణం. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే.. సిగరెట్లు తాగేవాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ.
రోజూ ఆల్కహాల్ తీసుకునేవాళ్లలో కూడా కార్డియోవాస్కులర్ జబ్బుల ప్రమాదం ఉంటుంది. అలాగే గంజాయి, ఇతర డ్రగ్స్ కూడా హార్ట్ బీట్, బ్లడ్ ప్రెజర్‌ను అమాంతం పెంచేస్తాయి. వీటిని తీసుకునేవాళ్లలో కూడా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 20 శాతం ఎక్కువ అని స్టడీలు చెప్తున్నాయి.
విటమిన్–డి లోపం వల్ల కూడా హైపర్‌టెన్షన్, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కొలెస్ట్రాల్, బీపీ వంటివి పెరిగినా, మెంటల్ హెల్త్ సరిగా లేకపోయినా, జంక్ ఫుడ్, కెఫిన్ మరీ ఎక్కువైనా, హార్మోనల్ ఇంబాలెన్స్ తెలెత్తినా గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. వీటితోపాటు నెగెటివ్ ఎమోషన్స్ కూడా హార్ట్ పై ప్రభావం చూపుతాయి. ఒంటరిగా, దిగాలుగా ఉండేవాళ్లకు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడితో బాధపడేవాళ్లకు గుండె పోటు ప్రమాదం ఎక్కువ.
గుండెపోటు రాకుండా జాగ్రత్తపడాలంటే యాక్టివ్ లైఫ్‌స్టైల్ గడపాలి. తేలికపాటి వాకింగ్ లాంటివైనా చేయాలి. జంక్ ఫుడ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తాజా ఆహారాలు తీసుకోవాలి.