ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఏం పెట్టాలంటే..

పిల్లలకు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ టైంలో పిల్లలు యాక్టివ్‌గా ఉంటూ , చదివినవన్నీ గుర్తుకు ఉంచుకోవాలంటే వాళ్లు సరైన పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి.

Advertisement
Update:2023-03-10 12:05 IST

ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఏం పెట్టాలంటే..

పిల్లలకు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ టైంలో పిల్లలు యాక్టివ్‌గా ఉంటూ , చదివినవన్నీ గుర్తుకు ఉంచుకోవాలంటే వాళ్లు సరైన పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలి. ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఏం పెట్టాలంటే..

పరీక్షల టైంలో పిల్లల్లో కొంత ఆందోళన, ఒత్తిడి కనిపించడం సహజం. దీనివల్ల కొంతమంది పిల్లలు నీరసించిపోతుంటారు. అందుకే పిల్లలకు ఎగ్జామ్స్ టైంలో పండ్లు, జ్యూస్‌లు లాంటివి ఎక్కువ ఇస్తుండాలి. దీనివల్ల పిల్లలు యాక్టివ్‌గా ఉండడంతో పాటు ఎండాకాలం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

పరీక్షల టైంలో పిల్లలకు కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, పప్పులు వంటివి రోజువారీ ఆహారంలో ఇస్తుండాలి. తేలిగ్గా అరిగే ఆహారాన్ని ఇస్తే.. నిద్ర మత్తు రాకుండా ఉంటుంది. వేయించిన ఆహారాలు, నాన్ వెజ్ వంటివి జీర్ణమవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం మేలు. అలాగే పిల్లలకు పాల ఉత్పత్తులు ఇవ్వడం కూడా ఎంతో అవసరం. పాలలో ఉండే పోషకాలు, కాల్షియం వంటివి పిల్లలను ఒత్తిడికి దూరంగా ఉంచుతాయి.

ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు ఉదయం ఇడ్లీ, దోశ, పండ్లు, జ్యూస్‌లు, కూరగాయలతో చేసిన శాండ్ విచ్, మొలకలు వంటివి ఇవ్వాలి. ఇక మధ్యాహ్నభోజనం తేలికగా అరిగేలా ఉండాలి. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన కూరలు, పప్పు, పులుసు వంటివి ఇవ్వొచ్చు.

ఇక శ్నాక్స్ విషయానికొస్తే.. డ్రైఫ్రూట్స్, స్మూతీల్లాంటివి ఇవ్వొచ్చు. అలాగే డిన్నర్‌ టైంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఏదైనా కొద్ది మొత్తంలో ఇవ్వాలి. పిల్లల ఆహారం విషయంలో కాస్త కేర్ తీసుకుంటే.. వాళ్లు ఒత్తిడి లేకుండా పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. తద్వారా పరిక్షల్లో మంచిగా పెర్ఫార్మ్ చేసే వీలుంటుంది.

Tags:    
Advertisement

Similar News