రాత్రి భోజనం చేయడానికి ఇదే సరైన సమయం

త్వరగా భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం నిద్రించే సరికి మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వాలి.

Advertisement
Update:2023-11-12 09:03 IST

రాత్రి భోజనం చేయడానికి ఇదే సరైన సమయం

మనం చేసే చిన్న పొరపాటు ఒక్కోసారి పెద్ద ప్రమాదానికి కారణంగా మారే అవకాశం ఉంది. తెలిసో, తెలియకో, అవసరానికో చేసే చిన్న తప్పు మన శరీరంపై ప్రభావం చూపుతుంది. అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది రాత్రి భోజనం.

మారుతున్న కాలంలో మన శరీరానికి సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు. అందుకే అనేక అనారోగ్య సమస్యలు. జంక్ ఫుడ్ , కొవ్వు ఉండే పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల చేత ఎంతోమంది చాలా మంది గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. రాను రాను దీనికి వయసుతో సంబంధం లేకుండా పోతోంది. ఈ నేపధ్యంలో వయస్సుతో సంబంధం లేకుండా అసలు మనం ఖచ్చితంగా పాటించిన ఆరోగ్యకరమైన నియమం సాయంత్రం సరైన సమయంలో భోజనం చేయటం.

త్వరగా భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మనం నిద్రించే సరికి మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వాలి. ఇలా ఆహారం త్వరగా జీర్ణమవ్వాలంటే మనం ఖచ్చితంగా రాత్రి పూట త్వరగా తినేయాలి. అందుకే ఈ సమయంలో మాంసాహారానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి. పల్లీలు, రాజ్మా, సోయాచిక్కుళ్లు వంటి ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్ లభించడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే రాత్రి భోజనం త్వరగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తి ఇంకా యాసిడ్ రిప్లెక్షన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే నిద్ర కూడా త్వరగా పట్టడంవల్ల నిద్రలేమి సమస్య కూడా రాకుండా ఉంటుంది.


బరువు తగ్గాలనుకునే వారు మరింత ముఖ్యంగా భోజనాన్నిసాయంత్రమే ముగించేయాలి. అందువల్ల శరీరంలో అదనంగా కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా ఉంటాయి. శరీరంలో అవయవాలకు తగినంత విశ్రాంతి కూడా లభిస్తుంది. అందువల్ల మనం మరుసటి రోజూ ఉత్సాహంగా, శక్తివంతంగా పని చేసుకోవచ్చు. అలాగే మన శరీరం కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి భోజనాన్ని త్వరగా చేయడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. శరీరంలో మలినాలు, విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. శరీరంలో జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది.

సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే మనం ఖచ్చితంగా భోజనాన్ని తీసుకోవాలని మసాలాలు, నూనెలు లేకుండా చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అప్పుడే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని మనం సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ బిజీ జీవనశైలి తరచుగా రివర్స్‌లో సాగుతుంది. చాలామంది అల్పాహారం తేలికగా, రాత్రి భోజనాన్ని చాలా భారీగా చేస్తారు.

ఇది ఊబకాయం వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది.. అంతేకాదు గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదాలను పెంచుతుంది. అవి ఒక్కసారి మీ ఆరోగ్యాన్ని టచ్ చేస్తే ఇక అంతే.. మీరు నిత్యం డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే నిద్రవేళకు కనీసం 2-3 గంటల ముందు రాత్రి భోజనంకానిచ్చెయ్యండి మరి.

Tags:    
Advertisement

Similar News