వైట్ టీ గురించి తెలుసా?

మనకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ గురించి తెలుసు. కానీ, వైట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Advertisement
Update:2024-05-02 15:13 IST

మనకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ గురించి తెలుసు. కానీ, వైట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కమీలియా సినెన్సిస్ అనే మొక్క ఆకులు పువ్వులతో చేసే టీని ‘వైట్ టీ’ అంటారు. ఈ టీ ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లోని డార్జిలింగ్, అస్సాం ప్రాంతాలలో ఈ టీ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ మొక్కల పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి. అందుకే దీంతో చేసిన టీ తెలుపురంగు లేదా లేతగోధుమ రంగులో ఉంటుంది. ఇది రుచికి తియ్యగా, వగరుగా ఉంటుంది.

ఈ టీని లేత ఆకులు, పువ్వుల మొగ్గల నుంచి తయారుచేస్తారు. ఈ టీలో వివిధ టానిన్లు, ఫ్లోరైడ్లు, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో నికోటిన్, కెఫెన్ వంటివి ఉండవు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.



వైట్ టీతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా డయాబెటిస్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. ఈ టీలోని నేచురల్ కాంపౌండ్లు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇది శరీరంలోని ఇంఫ్లమేషన్, వాపుని తగ్గిస్తుంది. ఎలాంటి అనారోగ్యం బారిన పడినా త్వరగా కోలుకునేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్ కణాల ఆరోగ్యానికి, వాపును తగ్గించడంలో సాయపడతాయి.

ఇకపోతే వైట్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోయేలా చేస్తాయి. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ టీ మేలు చేస్తుంది. ఇది శరీరంలో కొవ్వు వేగంగా కరిగేలా హెల్ప్ చేస్తుంది.

వైట్ టీ బ్యాగ్స్, డ్రైడ్ ఫ్లవర్స్.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. మరిగే నీటిలో టీ ఆకులు, మొగ్గలను వేసి నాలుగు నిముషాల పాటు మరిగిస్తే.. వైట్‌ టీ రెడీ. రుచి కోసం తేనె, యాలకులు, మిరియాల వంటివి కలుపుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News