బీపీ సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఇదే!

బీపీ సమస్య ఈమధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తోంది. రెండు పూటలా ట్యాబ్లెట్లు వేసుకుంటేగానీ కంట్రోల్‌లో ఉండని పరిస్థితి.

Advertisement
Update:2024-08-20 13:29 IST

బీపీ సమస్య ఈమధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తోంది. రెండు పూటలా ట్యాబ్లెట్లు వేసుకుంటేగానీ కంట్రోల్‌లో ఉండని పరిస్థితి. అయితే తాజాగా సైంటిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తేల్చారు. రోజూ కొద్దిపాటి నడక బీపీకి చక్కని మెడిసిన్‌లా పనిచేస్తుందట.

ఆస్ట్రేలియాలోని వెస్టర్న్‌ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు 50 నుంచి 80 మధ్య వయసు గల 35మంది మహిళలు 32 మంది పురుషులతో ఓ అధ్యయనం నిర్వహించారు. మొదటి ప్రయోగంలో రోజులో ఎనిమిది గంటలు వాళ్లకు ఏ పని చెప్పకుండా కూర్చోబెట్టి ఉంచారు. తరువాత వాళ్ల బీపీని పరీక్షించారు. రెండో ప్రయోగంలో ప్రతి ఒక్కరిని ఒక 30 నిముషాల నడిపించి తర్వాత ఆరు గంటలు కూర్చోబెట్టారు. మూడో ప్రయోగంలో వరుసగా ఆరు గంటలు కూర్చో బెట్టి మధ్యలో ప్రతి అరగంటకు ఒకసారి మూడు నిముషాల పాటు నడిపించారు. ఇలా మూడు ప్రయోగాల్లో దశల వారీగా బీపీని పరీక్షిస్తే మొదటి ప్రయోగంలో బీపీలో ఎటువంటి మార్పు రాలేదు. మిగతా రెండు సార్లు మాత్రం బీపీ కంట్రోల్ అయినట్టు గమనించారు. మెడిసిన్స్ వేసుకుంటే ఎంత కంట్రోల్‌లో ఉంటుందో ఇదే ఫలితాన్ని రావడం ఇక్కడ గమనించారు. ఈ రీసెర్చ్ ఫలితాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఆమోదించింది.

సైంటిస్టులు చేసిన ఈ రీసెర్చ్ ప్రకారం రోజూ కొద్దిపాటి నడక బీపీని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేస్తుందని తేలింది. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలపాటు వారానికి అయిదు రోజుల చొప్పున వాకింగ్ చేస్తే మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు.

ఇలా నడవాలి

నడకను ఎవరైనా, ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. అయితే 50 ఏళ్లు దాటినవాళ్లు, ఆయాసం, గుండెనొప్పి, హై బీపీ​ వంటి సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ముందుగా డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నడకను నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ పోవాలి. మొదట ఐదు నిముషాలతో స్టార్ట్ చేసి ప్రతివారం నడిచే సమయాన్ని ఐదు నిమిషాల చొప్పున పెంచుకుంటూ పోవచ్చు. అలా రోజుకి 20 నుంచి 30 నిమిషాల పాటు నడక ఉండేలా అలవాటు చేసుకోవాలి. నడిచే వేగం కూడా నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. ఒకేసారి వేగంగా నడిస్తే కండరాలు పట్టేయటం, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.

Tags:    
Advertisement

Similar News