కాఫీ ఎక్కువగా తాగితే జరిగేది ఇదే!
కాఫీ అనేది చాలామందికి ఒక ఎమోషన్. నిద్ర లేవగానే ఓ కప్పు, ఆఫీసు బ్రేక్ టైంలో మరో కప్పు, ఈవెనింగ్ మరో కప్పు.. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు కాఫీ తాగుతుంటారు. అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దీర్ఘకాలంలో చాలానే నష్టాలుంటాయట.
కాఫీ అనేది చాలామందికి ఒక ఎమోషన్. నిద్ర లేవగానే ఓ కప్పు, ఆఫీసు బ్రేక్ టైంలో మరో కప్పు, ఈవెనింగ్ మరో కప్పు.. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు కాఫీ తాగుతుంటారు. అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దీర్ఘకాలంలో చాలానే నష్టాలుంటాయట. అవేంటంటే..
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. కాఫీని మితంగా తీసుకుంటే ఎంత లాభమో అతిగా తీసుకుంటే అంతకంటే ఎక్కువ నష్టం. అసలు రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగాలి? మితిమిరితే కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీలో ఉండే కెఫీన్ వల్ల శరీరంలో ఎడ్రినల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ముఖ్యంగా నిద్రలేమి సమస్య వస్తుంది. రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగడం వల్ల క్రమంగా నిద్ర తగ్గిపోతుంది. కాఫీ ఎక్కువగా తాగేవారిలో 33 శాతం మందికి నిద్రలేమి సమస్యలున్నట్టు కొన్ని స్టడీల్లో తేలింది. అంతేకాదు, ఈ హార్మోన్ అతిగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది.
శరీరంలో కెఫీన్ ఎక్కువవడం వల్ల కార్డిసాల్ హార్మోన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీనివల్ల చర్మం నుంచి నూనె ఎక్కువగా స్రవిస్తుంది. తద్వారా జిడ్డు చర్మం, ట్యానింగ్ వంటి సమస్యలొస్తాయి.
కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటును పెరిగి.. కళ్లు, మెదడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా వయసుపైబడినవాళ్లు కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మెదడుకి రక్త సరఫరా చేసే సన్నని రక్తనాళాలు అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, డిప్రెషన్ వంటి పలు రకాల ఇబ్బందులకు దారి తీయొచ్చు.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల దాహం తగ్గుతుంది. తద్వారా శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ జరగొచ్చు. పిల్లలు కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. ఏకాగ్రత తగ్గిపోతుంది.
నిపుణుల ప్రకారం నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు, ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు కాఫీ తాగకపోవడమే మంచిదట.
ఇకపోతే.. ఉదయాన్నే కాఫీ తాగే అలవాటుంటుంది చాలామందికి. అయితే ఈ అలవాటు వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు నోటి ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. కాఫీతో ఎలాంటి రిస్క్ ఉండకూడదంటే రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగాలి. అదికూడా లైట్‌గా ఉంటే మంచిది.