అలసటకు చెక్ పెట్టండిలా..
రోజంతా కష్టపడినప్పుడు, నిద్ర సరిపోనప్పుడు లేదా ఒంట్లో బాగోనప్పుడు శరీరం నీరసించిపోవడం లేదా అలసటగా అనిపించడం సహజం. అలా కాకుండా ఊరికే అలసటగా అనిపిస్తుంటే దానికి మరేదో కారణం ఉండి ఉండొచ్చు.
రోజంతా కష్టపడినప్పుడు, నిద్ర సరిపోనప్పుడు లేదా ఒంట్లో బాగోనప్పుడు శరీరం నీరసించిపోవడం లేదా అలసటగా అనిపించడం సహజం. అలా కాకుండా ఊరికే అలసటగా అనిపిస్తుంటే దానికి మరేదో కారణం ఉండి ఉండొచ్చు. కాబట్టి నిస్సత్తువను అంత ఈజీగా తీసిపారేయకూడదు. అసలు అలసట ఎందుకొస్తుందంటే..
కారణం లేకుండా శరీరం నీరసిస్తుందంటే.. దానికి పోషకాల లోపం కారణం అయ్యి ఉండొచ్చు. ఉదాహరణకు శరీరంలో ఐరన్ లేదా విటమిన్ బీ12 వంటివి లోపిస్తే అలసట లక్షణంగా కనిపించొచ్చు. కాబట్టి తరచూ అలసట అనిపిస్తుంటే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే శరీరంలో తగినంత రక్తం లేకపోయినా అలసటగా అనిపిస్తుంటుంది.
తీసుకున్న ఆహారం నుంచి పోషకాలు గ్రహించాలంటే శరీరంలో థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉంటే కూడా తరచూ నీరసం ఆవహిస్తుంది. కాబట్టి అలసటగా అనిపిస్తున్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోవడం మంచిది.
రక్తపోటులో మార్పులొచ్చినప్పడు కూడా శరీరం అలసిపోతుంది. కాబట్టి బీపీని ఎప్పుడూ నార్మల్‌గా ఉంచుకోవాలి. టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ అతిగా తీసుకునే అలవాటును తగ్గించుకోవాలి.
మానసిక సమస్యలున్నప్పుడు కూడా అలసటగా అనిపిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ లాంటివి వేధిస్తున్నప్పుడు ఆకలి తగ్గడం, అలసటగా అనిపిండం కామన్. కాబట్టి ఇలాంటివాళ్లు వ్యాయామాలు చేస్తూ యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేయాలి.
వీటితో పాటు కిడ్నీల్లో సమస్యలున్నా, లివర్ పనితీరులో మార్పులొచ్చినా కూడా అలసట లక్షణంగా కనిపిస్తుంది. ఎవరికి ఏ కారణం చేత అలసట వస్తుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి రోజుల తరబడి అలసటగా అనిపిస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవడం ముఖ్యం.