ఇవి తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు

ప్రతిరోజూ పరగడపున కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల వేగంగా సన్నబడొచ్చు అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్.

Advertisement
Update:2023-01-03 12:45 IST

సన్నగా కనిపించేందుకు జిమ్ కెళ్లడం, రన్నింగ్‌ చేయడం.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీటితో పాటు ప్రతిరోజూ పరగడపున కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల వేగంగా సన్నబడొచ్చు అంటున్నారు న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్. అలాంటి కొన్ని డ్రింక్స్ ఇప్పుడు చూద్దాం.

వెనిగర్‌

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌ స్టడీ ప్రకారం వెనిగర్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది. అలాగే సీరం, ట్రైగ్లిజరాయిడ్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అయితే వెనిగర్ రిజల్ట్ తెలియాలంటే ఖాళీ కడుపుతో తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. పావులీటర్ నీళ్లలో 5 ఎం.ఎల్ యాపిల్ సైడర్ వెనిగర్‌‌ను కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే కొవ్వు కరగడం వేగవంతం అవుతుంది.

మెంతుల నీళ్లు

మెంతులు నానబెట్టిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. మెంతి గింజల్లో ఉండే సపోనిన్‌, ఫైబర్‌‌లు కొవ్వు కరిగే ప్రాసెస్‌కు హెల్ప్ చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి.

జీరా వాటర్

జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. శరీరానికి పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది.

దాల్చిన చెక్క నీరు

దాల్చిన చెక్క కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. ఇందులో యాంటీ పెరాసిటిక్ లక్షణాలు ఉంటాయి. దాల్చిన చెక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు డయాబెటిస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

ఇక వీటితో పాటు రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ టైంలో కూరగాయల జ్యూస్‌ తీసుకోవడం ద్వారా కూడా వేగంగా బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా ఆకుకూరలను జ్యూస్ చేసుకుని అందులో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే కావల్సిన పోషకాలు అందడంతో పాటు ఆకలి తగ్గుతుంది.

Tags:    
Advertisement

Similar News