వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

బరువు తగ్గడం కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే మార్గం ఏదైనా బరువు తగ్గే విషయంలో కొన్ని కీలకమైన విషయాలను మైండ్‌లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

Advertisement
Update:2024-08-04 17:07 IST

బరువు తగ్గడం కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. అయితే మార్గం ఏదైనా బరువు తగ్గే విషయంలో కొన్ని కీలకమైన విషయాలను మైండ్‌లో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌రువు త‌గ్గాల‌నుకునేవాళ్లు తాము అమలు చేయ‌గ‌లిగే ప్లాన్‌నే రూపొందించుకోవాలి. తక్కువ రోజుల్లో ఎక్కువ కేజీలు త‌గ్గిపోవాల‌నే టార్గెట్ పెట్టుకోకూడ‌దు. నెమ్మదిగా, హెల్తీగా బ‌రువు త‌గ్గే విధానాలను ఎంచుకోవాలి. బరువు తగ్గడం గురించి అతిగా కంగారు పడకూడదు. దానివల్ల ఒత్తిడితో మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

బరువు తగ్గడంలో డైటింగ్‌దే కీ రోల్. చాలామంది వ్యాయామం ఎక్కువగా చేస్తూ.. డైటింగ్‌ విషయంలో పెద్దగా కేర్ తీసుకోరు. బరువు తగ్గడంలో డైటింగ్‌ 80 శాతం పాత్ర పోషిస్తే.. వ్యాయామం కేవలం 20 శాతం మాత్రమే. కాబట్టి డైట్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి.

చాలామంది డైటింగ్‌, వ్యాయామం విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం నడుచుకుంటారు. అయితే అప్పుడప్పుడు శరీరం చెప్పేది కూడా వినాలి. ఎప్పుడైనా తీవ్రంగా అలసిపోయి వ్యాయామం మానెయ్యాలనిపిస్తే.. ఒక్కరోజు మానెయ్యడం వల్ల పెద్దగా ప్రమాదమేదీ ఉండదు. అలాగే అప్పుడప్పుడు ఇష్టమైన ఆహారం కొద్ది మోతాదులో తీసుకున్నా ఫర్వాలేదు. మరీ స్ట్రిక్ట్‌గా ఉంటూ శరీరాన్ని, మనసుని కష్టపెట్టొద్దు.

చాలామంది ప్రొటీన్‌ షేక్‌, ప్రొటీన్‌ బార్స్‌, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతుంటారు. అయితే వాటితో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. కాల్షియం ట్యాబ్లెట్లు, ప్రొటీన్ పౌడర్లకు బదులు, ఆకు కూరలు, పాలు, గుడ్లు వంటి నేచురల్ న్యూట్రిషన్ ను పాటించడం బెటర్.

చాలామంది పొట్ట దగ్గర కొవ్వు తగ్గితే చాలు అనుకుంటారు. కేవలం పొట్ట వ్యాయామాలే చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. శరీరం మొత్తానికి కదలిక ఉండేలా వ్యాయామాలు చేయాలి. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు చేయాలి.

వ్యాయామాలు ఎప్పుడూ ఆక్సిజన్‌ ఎక్కువగా ఉన్న చోటనే చేయాలి. అప్పుడే సరైన రిజల్ట్ ఉంటుంది. గాలి ఆడని ఇరుకైన గదుల్లో వ్యాయామం చేయకూడదు. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి విటమిన్‌–డి లోపం ఉండకూడదు. అందుకే రోజూ పొద్దున ఎండలో కాసేపు గడపాలి.

ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ‘బరువు తగ్గి తీరతాను’ అనే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. సాధ్యమైనంత సంతోషంగా ఉండాలి. అప్పుడే కోరుకున్న రిజల్ట్ ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News