నోటి పూతకు చెక్ పెట్టండిలా..

చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం, వేడి చేయడం వంటి కారణాల వల్ల నోటి పూత సమస్య ఎక్కువగా వస్తుంటుంది.

Advertisement
Update:2023-12-20 13:01 IST

చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం, వేడి చేయడం వంటి కారణాల వల్ల నోటి పూత సమస్య ఎక్కువగా వస్తుంటుంది. అయితే ఈ సమస్యను ఇంటి చిట్కాలతోనే సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలామందికి నోటిపూత సమస్య వేధిస్తుంటుంది. నోటిలో వచ్చే పుండ్లు ఏమీ తినకుండా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని వీలైనంత త్వరగా తగ్గించుకోవాలి.

నోటి అల్సర్లకు ప్రధానమైన కారణం డీహైడ్రేషన్. సరైన మోతాదులో నీళ్లు తాగడం ద్వారా నోటి పుండ్లు రాకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఇవి వస్తుంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.

నోటి పుండ్లను త్వరగా తగ్గించుకునేందుకు తేనె బాగా పనికొస్తుంది. తేనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు అల్సర్‌‌లను వెంటనే తగ్గిస్తాయి. కాబట్టి నోటి పూత ఉన్నచోట తరచూ తేనె రాసుకుంటూ ఉండడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

శరీరంలో యాసిడ్స్‌ ఎక్కువైనప్పుడు కూడా నోటి పూత వస్తుంటుంది. అందుకే నోరు పూసినప్పుడు రోజూ అర స్పూన్ బేకింగ్ సోడా కలిపిన నీటిని తీసుకోవాలి. తద్వారా శరీరంలోని పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అలాగే బేకింగ్ సోడా కలిపిన నీటిని నోటితో పుక్కిలించడం ద్వారా కాడా బెనిఫిట్ ఉంటుంది.

చర్మ సంరక్షణకు కొబ్బరినూనె కూడా చక్కగా పనిచేస్తుంది. అందుకే నోటి పూత ఉన్న చోట కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే పొద్దున కల్లా పుండ్లు మానతాయి. కొబ్బరి నూనెలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుండ్లు, నొప్పిని త్వరగా నయం చేస్తాయి.

ఇకపోతే మౌత్ అల్సర్స్ వచ్చినప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం మానేయాలి. అలాగే మసాలాలు తగ్గించాలి. నూనె పదార్థాలకు బదులు పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. టీ, కాఫీలకు కూడా కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది.

Tags:    
Advertisement

Similar News