జుట్టు పలుచబడుతోందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే

ప్రతీ రోజు గోరు వెచ్చని నూనెతో తలకు మర్ధనా చేసుకోవడంతో పాటు ఉసిరి కాయ ఒకటి తినడం మంచింది. అలాగే కలబంద రసాన్ని హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవడంతో పాటు.. రసాయనాలు ఎక్కువగా ఉండని షాంపూతో తలస్నానం చేయడం మంచింది.

Advertisement
Update:2022-10-03 10:00 IST

ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా జట్టు అంటే చాలా ప్రేమ ఉంటుంది. సహజంగానే మనిషి తలపై ఉండే జట్టు ప్రతీ రోజు రాలిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల చాలా మందిలో జుట్టు అత్యధికంగా రాలిపోయి పల్చ బడుతుంది. పురుషుల్లో జుట్టు అత్యధికంగా రాలిపోయి బట్ట తల వస్తే.. మహిళల్లో పొడుగు జడ కాస్తా పొట్టిగా అవతుంది. జుట్టు పెరగడానికి, రాలిపోకుండా ఉండటానికి అనేక రకాల నూనెలు, షాంపూలు వాడుతూ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సాధారణంగా వయసు పైబడిన కొద్దీ జట్టు రాలడం ఎక్కువ అవుతుంది. కానీ ఈ మధ్య చిన్న వయస్సులోనే ఈ సమస్య అధికంగా కనపడుతోంది. మగవారి విషయం వదిలేస్తే.. టీనేజ్ అమ్మాయిల్లో ఈ మధ్య జట్టు రాలే సమస్య అధికంగా ఉంటోంది. ఈ సమస్యను అధిగమించడానికి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

మన రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే శరీరం ఫిట్‌గా మారుతుందని అందరికీ తెలిసిన విషయమే. అదే విధంగా కొన్ని అలవాట్లను మార్చుకుంటే జుట్టు రాలడం కూడా తగ్గి.. ఒత్తైన జుట్టు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తినే వంటల్లో మసాలాలు బాగా తగ్గించడం, వేడి పుట్టించే పదార్థాలను తక్కువగా తీసుకోవడం జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే ప్రతీ రోజు గోరు వెచ్చని నూనెతో తలకు మర్ధనా చేసుకోవడంతో పాటు ఉసిరి కాయ ఒకటి తినడం మంచింది. అలాగే కలబంద రసాన్ని హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవడంతో పాటు.. రసాయనాలు ఎక్కువగా ఉండని షాంపూతో తలస్నానం చేయడం మంచింది. ఇక రోజువారీగా బ్యాలెన్డ్స్ డైట్‌ను తీసుకోవాలి.

తలకు నూనె వారానికి ఒకసారి మాత్రమే పెడుతుంటారు. అలా కాకుండా రోజు విడిచి రోజు నూనె పెట్టడం మంచిది. అది కూడా కొబ్బరి, నువ్వులు, పల్లీ నూనెను వాడటం మంచింది. నవరత్న లాంటి నూనెలను వాడితే జుట్టుపై రసాయనాల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నూనెను జట్టుకు రాసి వదిలేయడం కాకుండా.. తలపై మంచిగా మర్థనా చేసుకోవడం వల్ల కుదుళ్లు గట్టి పడతాయి. మసాజ్ చేసిన వెంటనే స్నానం చేయకుండా.. పొడిగా ఉండే టవల్‌ను తలకు చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు ఎక్స్‌ట్రా కండిషనింగ్ అవుతుంది.

జుట్టు సమస్యలను నివారించడానికి ఉసిరి, కలబంద మంచిగా పని చేస్తాయి. జుట్టు త్వరగా తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లిపోకుండా ఉసిరి చాలా చక్కగా పని చేస్తుంది. ప్రతీ రోజు ఉదయాన్ని ఒక చిన్న ఉసిరి కాయను తింటే జుట్టుకు వచ్చే సమస్యలను దూరం చేసుకోవచ్చు. అయితే ఉసిరి ఏడాదంతా దొరకవు కాబట్టి.. ఎండబెట్టిన ఉసిరి ముక్కలు లేదా ఉసిరి మురబ్బాను తిన్నా ప్రయోజనం ఉంటుంది. ఇక అలోవెర (కలబంద) వల్ల కూడా జుట్టు ఆరోగ్యం మెరుగు పడుతుంది. షుగర్ పేషెంట్లు ఈ కలబంద ముక్కను తింటే ఎంత లాభమో.. దీని రసాన్ని జుట్టుకు పట్టిస్తే కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. అలోవెర రసాన్ని పట్టించి.. గంట సేపటి తర్వాత చన్నీటి స్నానం చేస్తే తళతళలాడే జుట్టు మీ సొంతం అవుతుంది.

కాగా, ఎవరైనా సరే ప్రతీ రోజు తలస్నానం చేయడం మంచిది కాదు. రోజూ స్నానం చేస్తే జుట్టు ఎక్కువగా పాడై పోతుంది. అంతే కాకుండా నూనె రాయకుండా తలస్నానం అస్సలు చేయవద్దు. ప్రతీ తలస్నానానికి కనీసం ఒక రోజైనా గ్యాప్ ఇవ్వడం మంచిది. ఇక ఆహారంలో మసాలాలు తగ్గించి నూనె, కొవ్వు పదార్థాలు కాస్త ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే జుట్టుకు నిగనిగలాడుతుంది.ఇక దువ్వే సమయంలో కూడా మొత్తని, చెక్క దువ్వెనలు వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News