ఎండకి మీ చర్మం ట్యాన్ అవుతోందా ? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి

నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది.

Advertisement
Update:2024-03-01 09:52 IST

ఫిబ్రవరి నెల ముగిసి ఇంకా మార్చి మొదలవ్వలేదు కానీ సూర్యుడు మాత్రం రెచ్చిపోతున్నాడు. అలా కొద్ది సేపు ఎండలో తిరిగితే ముఖం, చేతులు సహా ఎండకు గురైన ఇతర శరీర భాగాలు నల్లగా లేదా ముదురు రంగులోకి మారిపోతాయి, దీనినే మనం ట్యాన్ అంటాము.

నిజానికి ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుండి మన చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది. మెలనిన్ చేరటం వల్ల సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలు ట్యాన్ అవుతాయి. చర్మంపై ఈ నలుపుదనం అనేది 7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. అది చర్మ రకం, చర్మ సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. సరైన సంరక్షణ లేకుంటే ట్యానింగ్ అనేది చాలా కాలం పాటు అలాగే కొనసాగుతుంది.

అందుకే.. చలికాలమైనా, వర్షాకాలమైనా సన్‌స్క్రీన్ లేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. కానీ కొన్ని సార్లు సన్‌స్క్రీన్ కూడా ట్యాన్‌ను అరికట్టలేకపోవచ్చు. మరైతే ఎలా అనుకుంటున్నారా? ఇంట్లో దొరికే సహజ పదార్ధాలతో టాన్ రిమూవ్ చేసుకోండి. అవేంటంటే...

చర్మంపై బంగాళాదుంప ముక్కలను రుద్దడం వలన సన్ టాన్ లేదా డార్క్ పిగ్మెంటేషన్‌ను వదిలించుకోవచ్చు. కాటెకోలేస్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.


పైనాపిల్ పేస్ట్‌ కూడా టాన్ ఉన్న ప్రదేశాలపై రాసుకోవచ్చు. స్ట్రాబెర్రీలు జ్యూసీగా, ఎంత రుచికరంగా ఉంటాయో, సన్ ట్యాన్‌ను తొలగించడానికి కూడా ఒక గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. స్ట్రాబెర్రీలలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్, విటమిన్ సి ఉంటాయి.


ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌. నిమ్మలో ఉండే అధిక స్థాయి సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. టాన్‌కు కారణమయ్యే మెలనిన్‌ను కూడా తొలగిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం నిమ్మరసానికి కొద్దిగా తేనె కలపండి, ఈ కాంబో ఫేస్ టాన్ రిమూవల్‌కి అత్యుత్తమ హోం రెమెడీలలో ఒకటి. అలాగే పెరుగు శనగపిండి పేస్ట్ కూడా. రెమెడీలను ప్రతిరోజూ కనీసం రెండు వారాల పాటు పునరావృతం చేయండి, మీ టాన్ పూర్తిగా మాయమవుతుంది.

Tags:    
Advertisement

Similar News