చక్కెర గురించి అపోహలు.. వాస్తవాలు!

డయాబెటిస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం. అలాగే డయాబెటిస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండడం వంటి నిమయాల వల్ల తీయ్యటి పదార్థాల పట్ల చాలామందిలో భయం ఏర్పడింది.

Advertisement
Update:2024-04-02 06:00 IST

రోజువారీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని ఆహారాల గురించి అపోహలు ఉండడం సహజం. అయితే ముఖ్యంగా తీపి పదార్థాలపై చాలామందికి రకరకాల అపోహలు ఉంటుంటాయి. అసలు తీపి ఆరోగ్యానికి మంచిదా? కాదా? షుగర్ తింటే ఏం జరుగుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ వ్యాధికి షుగర్ అనే పేరు ఉండడం. అలాగే డయాబెటిస్ పేషెంట్లు తీపికి దూరంగా ఉండడం వంటి నిమయాల వల్ల తీయ్యటి పదార్థాల పట్ల చాలామందిలో భయం ఏర్పడింది. వీటిపై ఉన్న కొన్ని అపోహలు ఏంటంటే..

‘తీపి ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలామందిలో ఉండే కామన్ అపోహ. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదు. తియ్యటి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగే మాట నిజమే అయినా వాటిని కరిగిస్తూ ఉంటే షుగర్ ప్రమాదం ఉండదు. డయాబెటిస్‌కు ముఖ్యంగా లైఫ్‌స్టైల్ అలవాట్లు, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, జన్యు సంబంధిత అంశాల వంటివి ఎక్కువగా కారణాలుగా ఉంటున్నాయి.

‘షుగర్ ఉంటే జీరో షుగర్ డైట్ పాటించాలి’ అని చాలామంది అపోహ పడుతుంటారు. అలాగే అసలు తీపి మంచిది కాదన్న ఉద్దేశంతో పూర్తిగా షుగర్ అవాయిడ్ చేసే వాళ్లూ ఉన్నారు. అయితే పంచదారతో చేసే స్వీ్ట్స్, కూల్ డ్రింక్స్ వంటివి మానుకుంటే తప్పు లేదు. కానీ, తియ్యగా ఉండే పండ్లు, ఇతర పదార్థాలకు కూడా దూరంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు.

‘చక్కెరకు బదులు ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు తింటే మంచిద’ని కొంతమంది అపోహ పడుతుంటారు. కానీ, అందులో కూడా నిజం లేదు. ఇవి చక్కెరను మానుకోలేని వాళ్లకు కాస్త ఉపశమనంగా ఉంటాయి. నష్టా్న్ని కాస్త తగ్గిస్తాయే గానీ, ఇవి హెల్దీ ఆప్షన్స్ అయితే కావు. వీటిని లాంగ్ టర్మ్‌లో వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఇక చాలామందిలో ఉండే మరో అపోహ ‘తీపి తింటే పళ్లు పుచ్చిపోతాయి’ అని. అయితే ఇందులో కూడా వాస్తవం లేదు. తీపి వల్ల కాదు, పంచదార, కూల్ డ్రింక్స్ వంటి ఆర్టిఫీషియల్ పదార్థాలతో పళ్లకు నష్టం కలగొచ్చేమో కానీ, సహజంగా దొరికే తేనె, పండ్లు, డ్రై ఫ్రూట్స్, చెరకు రసం.. ఇలాంటి తీపితో పళ్లకు గానీ, శరీరానికి గానీ ఎలాంటి నష్టం ఉండదు.

Tags:    
Advertisement

Similar News