జుట్టు చిట్లిపోతోందా? ఇలా చేసి చూడండి!

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. జుట్టుకి అందించే పోషణ వాటి చివర్ల వరకూ చేరకపోవడం వల్ల అక్కడి జుట్టు అలా పాలిపోతుంటుంది.

Advertisement
Update:2024-04-26 08:00 IST

లాంగ్ హెయిర్ అనేది ఇప్పుడు యూత్ ఫాలో అవుతున్న లేటెస్ట్ ట్రెండ్. ఆడవాళ్లతోపాటు కొంతమంది మగవాళ్లు కూడా జుట్టుని కాస్త పొడుగ్గా పెంచుతున్నారు. అయితే ఇలాంటివాళ్లకు జుట్టు చివర్లు చిట్లిపోవడం అనేది ప్రధానమైన సమస్యగా ఉంటోంది. దీన్నెలా తగ్గించొచ్చంటే..

లాంగ్ హెయిర్ మెయింటెయిన్ చేసేవాళ్లకు జుట్టు చివర్లు పాడైపోతే చూడ్డానికి అందగా కనిపించదు. అయితే జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ ఒత్తుగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. జుట్టుకి అందించే పోషణ వాటి చివర్ల వరకూ చేరకపోవడం వల్ల అక్కడి జుట్టు అలా పాలిపోతుంటుంది. అలాగే ఎండకు, పొల్యూషన్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వడం, నూనె అప్లై చేయకపోవడం కూడా దీనికి ప్రధానమైన కారణాలు.

చిట్లిపోయిన జుట్టుని సరిచేయడం కష్టం. కాబట్టి పలుచబడిన జుట్టు చివర్లను ముందుగా కట్ చేసేయాలి. అలాగని ప్రతిసారీ కట్ చేస్తూ పోతే జుట్టు పొడవు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి కట్ చేసి జుట్టుకి పోషణ ఇవ్వడంపై ఫోకస్ చేయాలి.

స్ప్లిట్ ఎండ్స్ సమస్య ఉన్నవాళ్లు కాలుష్యం, ఎండకు దూరంగా ఉండాలి. బయటకు వెళ్లినప్పుడు వీలైనంత వరకూ జుట్టుని కవర్ చేసుకోవాలి. జుట్టు ఎంత పొడిగా ఉంటే అంత ఎక్కువగా చిట్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టుకి ఎప్పుడూ తేమ అందిస్తుండాలి. దీనికోసం తరచూ నూనె అప్లై చేస్తుండాలి.

ప్రతి రోజూ తలస్నానం చేయడం, హెయిర్ డ్రయ్యర్లు వాడడం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది. అలాగే జుట్టు చిక్కు తీసేటప్పుడు కూడా చాలామందికి చివర్లు కట్ అయిపోతుంటాయి. కాబట్టి ఇలాంటివాళ్లు తప్పనిసరిగా కండీషనర్ వాడాలి. జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే దువ్వుకోవాలి.

జుట్టుకి షాంపూ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు పలుచబడే అవకాశం ఉంటుంది. కాబట్టి తలస్నానానికి కుంకుడుకాయలు లేదా మందార ఆకుల పేస్ట్ వంటివి వాడొచ్చు. అలాగే తలస్నానం వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే సరిపోతుంది.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా జుట్టుకి లోపలి నుంచి పోషణ అందించాలి. వీటికోసం నట్స్ ఎక్కువగా తినాలి. అలాగే చేపలు, బెర్రీస్, ఆకుకూరలు వంటివి కూడా డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతున్నవాళ్లు ఇంటర్నెట్‌లో చూసి షాంపూల వంటివి వాడకుండా డాక్టర్‌‌ను కలవడం మంచిది.

Tags:    
Advertisement

Similar News