మగాళ్ల ముఖ సౌందర్యం కోసం..
అందం విషయంలో నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలను మించిపోయారు. గంటల తరబడి రెడీ అవ్వాల్సిన అవసరం వాళ్లకి ఉండకపోవచ్చు.. కానీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వాడటంలో ఉత్సాహం చూపిస్తున్నారు.
ఏ.. అందం ఆడవాళ్ళకి పర్యాయపదమా.. లేకపోతే అందం అనగానే మగాళ్లు గుర్తు రాకూడదా.. నిజమే ఒకప్పుడు అందానికి ఆడాల్లే ప్రాధాన్యత ఇచ్చేవారు. మగవాళ్ళు వాళ్ళని చూసి వెటకారం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.. నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలను మించిపోయారు. గంటల తరబడి రెడీ అవ్వాల్సిన అవసరం వాళ్లకి ఉండకపోవచ్చు.. కానీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ వాడటంలో ఉత్సాహం చూపిస్తున్నారు. అంతే కాదు చక్కగా పనిగట్టుకొని పార్లర్ కి కూడా వెళుతున్నారు. అయితే అన్నింటికీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కొన్ని చిట్టి చిట్కాలు మగాళ్లకి కూడా ఉన్నాయండోయ్. అవేంటంటే..
ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళ స్కిన్ రఫ్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్. ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌కి అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి ఇది మీ డెడ్ స్కిన్‌ని తొలగించి చర్మాన్ని తాజాగా, మృదువుగా చేయటానికి ఉపయోగపడుతుంది.
ముఖం పొడిబారినట్లుగా అనిపిస్తే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖంపై తేమను నిలిపి ఉంచుతుంది. పొడిబారినివ్వకుండా చేస్తుంది.
మీరు కూడా క్లెన్సర్, స్క్రబ్బర్, మాయిశ్చరైజర్ వంటి వాటిని వాడవచ్చు. చక్కగా ఘాడత తక్కువగా ఉన్న వాటిని ఎంచుకొని అవసరాన్ని, అవకాశాన్ని బట్టి వాడుకోండి.
పండ్లు ఏవైనా ముఖానికి రాసుకొనే విషయంలో మంచే చేస్తాయి. టమాట, బొప్పాయి, ఆరెంజ్ ఇలా ఏదో ఒక ఫ్రూట్ చిన్న ముక్క తీసుకొని ముఖానికి రాసి కాసేపాగి కడిగేయండి. ఫ్రెష్‌గా అయిపోతుంది.
రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాల పాటు ముఖంపై ఐస్ క్యూబ్‌తో రుద్దటం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడంతో పాటు సమయానికి తిండి.. కంటి నిండా నిద్ర ఉంటే చాలు. అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.