సెల్ఫీతో స్ట్రెస్ తగ్గుతుంది! ఇంట్రెస్టింగ్ సర్వే!

పరిశోధనలో భాగంగా ఈ 41 మంది విద్యార్థులనూ తమ ఫోన్లతో మూడు రకాలైన ఫొటోలను తీస్తూ ఉండమని సూచనలు చేశారు. నవ్వుతూ దిగిన సెల్ఫీలు, తమకి నచ్చి, ఇతరులతో పంచుకోవాలనుకునే వస్తువుల ఫొటోలు, ఇతరులు సంతోషపడతారనుకునే సన్నివేశాల ఫొటోలు.. ఇలా మూడు రకాల ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయమని చెప్పారు.

Advertisement
Update:2024-06-25 14:00 IST

సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే సెల్ఫీ దిగనివాళ్లు ఉంటారా? అందులోనూ యూత్ సంగతైతే చెప్పక్కర్లేదు. డిఫరెంట్ యాంగిల్స్‌లో, కొత్తకొత్త పోజులిస్తూ దిగుతుంటారు. అయితే మొన్నటిదాకా సెల్ఫీలు చాలా నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతాయని విన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు సంతోషానికి దారితీస్తాయంటూ ఒక పరిశోధనలో తేలింది.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు తన యూనివర్సిటీలోని 41 మంది విద్యార్థులను సెల్ఫీ పరిశోధన కోసం సెలెక్ట్ చేసుకున్నారు. సాధారణంగా, చదువుకోవడం కోసం ఇల్లు వదిలి వచ్చే విద్యార్థులు రకరకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, కొత్త పరిసరాలకు సర్దుకుపోలేకపోవడం.. ఇవన్నీ వాళ్లని ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి. అలాంటి విద్యార్థుల పైన సెల్ఫీలు ఎలాంటి ప్రభావాన్నిచూపుతాయో తెలుసుకునేందుకు ఓ పరిశోధన చేశారు.

పరిశోధనలో భాగంగా ఈ 41 మంది విద్యార్థులనూ తమ ఫోన్లతో మూడు రకాలైన ఫొటోలను తీస్తూ ఉండమని సూచనలు చేశారు. నవ్వుతూ దిగిన సెల్ఫీలు, తమకి నచ్చి, ఇతరులతో పంచుకోవాలనుకునే వస్తువుల ఫొటోలు, ఇతరులు సంతోషపడతారనుకునే సన్నివేశాల ఫొటోలు.. ఇలా మూడు రకాల ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేయమని చెప్పారు. ఇలా ఫొటోలు తీసేటప్పుడు వాళ్ల మూడ్ ఎలా మారుతుందో తెలుసుకునేలా వాళ్ల ఫోన్లలో ఒక యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంచారు.

నవ్వితేనే..

ఓ నాలుగువారాల పాటు స్టూడెంట్స్ నమోదుచేసిన మూడువేల ఎమోషన్స్‌ని గమనించిన తర్వాత ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. ఎప్పటికప్పుడు నవ్వుతూ సెల్ఫీలను దిగిన విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెరిగిందట. తరచూ నవ్వడానికి వాళ్లు అలవాటుపడ్డారట. ఇక ఇతరులతో పంచుకునేందుకు తమకు ఇష్టమైన ఫొటోలను పంపించేవారిలో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరిగిందట. ఇతరులకి నచ్చే ఫొటోలు తీసిన వారిలో, సామాజిక సంబంధాలు మెరుగుపడ్డాయట. ఎప్పుడైనా నిరుత్సాహంగా అనిపిస్తే వెంటనే నవ్వుతూ ఓ సెల్ఫీ దిగితే ఒత్తిడి, నిరుత్సాహం వంటివి తగ్గుతాయట.

Tags:    
Advertisement

Similar News