ఊదా రంగు తేనె చూశారా?

నార్త్ కరోలినాలోని తేనెటీగలు పర్పుల్ రంగులో ఉండే తేనెను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

Advertisement
Update:2023-03-09 18:13 IST

తేనె ఏ రంగులో ఉంటుందో మనకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడైనా తేనెకు ఒకటే రంగు ఉంటుంది. కానీ, నార్త్ కరోలినాలో మాత్రం పర్పుల్ కలర్‌‌లో తయారవుతున్న తేనే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరస్తుంది.


నార్త్ కరోలినాలోని తేనెటీగలు పర్పుల్ రంగులో ఉండే తేనెను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ తేనెకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


నార్త్ కరోలినా దేశపు జాతీయ పురుగు తేనెటీగ. ఆ దేశం ఎప్పటినుంచో హనీ బీ ఫార్మింగ్ ద్వారా స్వచ్ఛమైన తేనెను సేకరిస్తూ ఉంది. అయితే రీసెంట్‌గా ఆ దేశంలోని శాండ్ హిల్స్ ప్రాంతంలో తేనెటీగలు పర్పుల్ రంగులో ఉన్న తేనెను తయారుచేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. దీనికి సంబంధించి.. పర్పుల్ రంగులో ఉన్న తేనే సీసా ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.


అయితే తేనె అలా పర్పుల్ రంగులో తయారవ్వడానికి కారణాలేంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. దీనిపై ఆ దేశపు కల్చరర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ చేస్తోంది. అయితే అల్యూమినియం ఎక్కువగా ఉండే సోర్ వుడ్ చెట్ల పువ్వుల వల్ల ఈ రంగు వచ్చి ఉంటుందని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

మరికొంతమంది సదరన్ లెదర్ వుడ్ చెట్ల పువ్వుల నుంచి తేనేకు ఆ రంగు వచ్చి ఉంటుందని, ఇంకొంతమంది తేనెటీగలు బ్లూబెర్రీస్ తినడం వల్ల కూడా పర్పుల్ కలర్ రావొచ్చని వాదిస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఈ తేనెను ఒకసారైనా టేస్ట్ చేయాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News