పొట్ట మాడ్చుకోకుండానే బరువు తగ్గొచ్చు! ఎలాగంటే..
బరువు తగ్గాలనుకునే చాలామంది రకరకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి.
బరువు తగ్గాలనుకునే చాలామంది రకరకాల డైట్‌లు పాటిస్తూ కడుపు మాడ్చుకుంటుంటారు. అయితే ఆకలిని చంపుకోకుండానే బరువు తగ్గే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కడుపు మాడ్చుకోకుండా బరువు తగ్గాలంటే.. తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాంటిటీ ఎక్కువగా ఉంటూ క్యాలరీలు తక్కువ అందించే ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. అలాంటి కొన్ని ఫుడ్స్ ఇవీ..
తింటూనే బరువు తగ్గాలనుకునేవాళ్లు నీటి శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌కు మొదటి ప్రధాన్యం ఇవ్వాలి. కర్భూజా, యాపిల్, బొప్పాయి, దానిమ్మ, సపోటా, బెర్రీ పండ్లు.. ఇలా వాటర్ కంటెంట్ ఉండే పండ్లను ఎంతైనా తినొచ్చు. పండ్లలో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఎంత తిన్నా బరువు పెరిగే ప్రమాదము ఉండదు.
అన్నంలో తినే కాయగూరల విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ఆకుకూరలు, దొండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకలీ, టొమాటో వంటివి ఎక్కువగా తినాలి. దుంప కూరలు తగ్గించాలి. వైట్‌రైస్‌కు బదులు బ్రౌన్ రైస్ వాడితే బరువు పెరిగే అవకాశం ఉండదు.
స్నాక్స్ రూపంలో మిల్లెట్స్ లేదా నట్స్‌తో చేసిన వంటకాల వంటివి తినొచ్చు. ఫ్రూట్ జ్యూస్‌లు తాగొచ్చు. అయితే వీటిలో చక్కెర లేకుండా చూసుకోవడం ముఖ్యం. టీ, కాఫీలకు బదులు హెర్బల్ టీ, గ్రీన్ టీలను ఎంచుకోవచ్చు.
ఇకపోతే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఒకేసారి ఎక్కువమొత్తంలో తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినేలా చూసుకోవాలి. నీరు తగినంత తాగాలి. ఓవరాల్ డైట్‌లో జంక్ ఫుడ్, చక్కెర, వేగించినవి లేకుండా చూసుకుంటే చాలు. అలాగే రోజుకో పావుగంట వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే పస్తులుండే అవసరం లేకుండానే రెండు మూడు నెలల్లో బరువు తగ్గడం గమనించొచ్చు.