హోలీ సంబరాల్లో పడి ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

హోలీ ఆడిన తర్వాత చర్మంపై ఎక్కడైనా దురదగా అనిపించినా, కళ్లు మండినా వెంటనే డాక్టర్‌‌ను కలవడం మంచిది.

Advertisement
Update:2024-03-23 16:55 IST

రంగుల పండుగ హోలీ అంటే యువతలో ఎక్కడలేని ఉత్సాహం బయటకొస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా రంగులు, నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో పడి కొన్ని ముందు జాగ్రత్తలు మర్చిపోవద్దంటున్నారు డాక్టర్లు. అవేంటంటే..

మార్చి 25న దేశమంతటా హోలీ సెలబ్రేషన్స్ జరుగుతాయి. అయితే హోలీ జరుపుకున్నంత సేపు సరదాగానే ఉంటుంది. కానీ, ఆ రంగుల్లో వాడే కెమికల్స్ వల్ల ఒక్కోసారి చర్మం పాడవ్వొచ్చు. రంగులు నేరుగా చర్మం మీద పడతాయి. దానివల్ల కొంతమందికి స్కిన్ ఎలర్జీల వంటివి రావొచ్చు. అలాగే కళ్లు, జుట్టు సమస్యలు కూడా రావొచ్చు. వీటి కోసం ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..

ముందుగా ఇది సమ్మర్ కాబట్టి సెలబ్రేషన్‌ను ఉదయం లేదా సాయంత్రం పూటల్లో జరుపుకుంటే మంచిది. ఒక పక్క ఎండ, మరో పక్క రంగుల దెబ్బకు చర్మం మరింత ఎక్కువ పాడవుతుంది. ఎండకు డీహైడ్రేషన్ కూడా అవ్వొచ్చు. కాబట్టి హోలీని ఎండ లేని సమయాల్లో ప్లాన్ చేసుకుంటే మంచిది.

రంగుల వల్ల చర్మం పాడవ్వకూడదనుకునే వాళ్లు రంగులు చల్లుకునే మందు చేతులు, ముఖానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల చర్మం కొంతవరకూ సేఫ్‌గా ఉంటుంది. అలాగే ఎండలో ఆడుకునేవాళ్లు సన్ స్క్రీన్ లోషన్ తప్పక వాడాలి.

హోలీ ఆడేటప్పుడు ఫుల్ స్లీవ్స్, ఫుల్ ప్యాంట్స్ ధరించడం ద్వారా చర్మం చాలావరకూ కవర్ అవుతుంది. అలాగే రంగు కళ్లలో పడకుండా గ్లాసెస్, జుట్టులో పడకుండా టోపీ వంటివి కూడా ధరించొచ్చు. కెమికల్ రంగులకు బదులుగా మార్కెట్లో ఆర్గానిక్ రంగులు కూడా దొరుకుతున్నాయి. పువ్వులు, ఆకులతో చేసిన నేచురల్ కలర్స్ వల్ల అంత నష్టం ఉండదు. కెమికల్ రంగుల ప్యాకెట్లు కొనేముందు ఎక్స్‌పైరీ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. డేట్ అయిపోయిన తర్వాత వాటిని ఉపయోగిస్తే ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక హోలీ అయిపోయిన వెంటనే చర్మం, జుట్టుపై క్రిములు లేకుండా వెంటనే తల స్నానం చేసేయాలి. కొన్నిచోట్ల రంగు అంత ఈజీగా వదలదు. అలాంటప్పుడు వాటిపై క్రీముల వంటివి పూయకుండా అలాగే వదిలేయాలి. వాటంతట అవి పోయే వరకూ వెయిట్ చేయాలి. హోలీ ఆడిన తర్వాత చర్మంపై ఎక్కడైనా దురదగా అనిపించినా, కళ్లు మండినా వెంటనే డాక్టర్‌‌ను కలవడం మంచిది.

Tags:    
Advertisement

Similar News