చలికాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఇలా చేయండి..

శీతాకాలంలో చలి ప్రభావంవల్ల న్యూమోనియా(Pneumonia) రిస్క్ ఎక్కువ. పిల్లలకి గానీ పెద్దవారికి గానీ రోగ నిరోధక శక్తి త‌క్కువ‌గా ఉంటే దీని బారిన పడే అవకాశం ఉంటుంది.

Advertisement
Update:2023-11-26 10:00 IST

శీతాకాలంలో చలి ప్రభావంవల్ల న్యూమోనియా(Pneumonia) రిస్క్ ఎక్కువ. పిల్లలకి గానీ పెద్దవారికి గానీ రోగ నిరోధక శక్తి త‌క్కువ‌గా ఉంటే దీని బారిన పడే అవకాశం ఉంటుంది. త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే న్యూమోనియా ప్రాణాంతకమవుతుంది. ఇంతకీ న్యూమోనియా అంటే ఏంటి? దాని లక్షణాలు ఏవి? దీని నుంచి తప్పించుకోవడానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో చూద్దాం.


ఊపిరితిత్తుల కణాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ను న్యుమోనియాగా పిలుస్తారు. ఊపిరితిత్తుల్లో చిన్నచిన్న గాలి గదులు ఉంటాయి. వీటినే ‘‘అల్వెయోలై’’గా పిలుస్తారు. వీటిల్లోకి బ్యాక్టీరియా చేరడంతో న్యుమోనియా సోకుతుంది. మన శరీరం పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్‌ల వడపొత అల్వెయోలై లోనే జరుగుతుంది.

అల్వెయోలై గుండా బయటకు వచ్చే ఆక్సిజన్ శరీరంలోని ఇతర కణాలకు రక్తం ద్వారా చేరుతుంది. న్యుమోనియా సోకినప్పుడు మాత్రం అల్వెయోలైలో నీరు, చీము పేరుకుంటాయి. వీటి వల్ల అల్వెయోలై పనితీరు మందగిస్తుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. దీంతో రక్తంలో కలిసే ఆక్సిజన్ పరమాణువుల సంఖ్య తగ్గిపోతుంది.

ఈ వ్యాధి బారిన పడితే ఛాతీలో అసౌకర్యం, దగ్గు, నీరసం, చెమట, చలి జ్వరం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఊపిరితిత్తుల్లో చేరిన ఇన్‌ఫెక్షన్ చీముగా మారవచ్చు. సీఓపీడీ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారిలో న్యూమోనియా రిస్క్ రెట్టింపుగా ఉంటుంది.


అందుకే వీరు చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం అయినప్పుడు డాక్టర్ ను సంప్రదించడంతో పాటూ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి. ఇందులో పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలను చేర్చుకోవాలి. న్యుమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, పెరుగు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. దీంతో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి.

ప్రతిరోజు 30 నిమిషాల పాటు నడక లేదా తేలికపాటి ఏరోబిక్ వ్యాయామం చేయవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్స్‌పై పోరాడటానికి శరీరానికి అవసరమైన శక్తిని లభిస్తుంది. బ్రీతింగ్ ఎక్స్‌సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. అంటేకాదు రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం.

Tags:    
Advertisement

Similar News