డయాబెటిస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవయవాలివే..

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువమందిని ఇబ్బందిపెడుతన్న సమస్య డయాబెటిస్. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పడం వల్ల వచ్చే ఈ డిసీజ్ వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి.

Advertisement
Update:2023-09-19 15:57 IST

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువమందిని ఇబ్బందిపెడుతన్న సమస్య డయాబెటిస్. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పడం వల్ల వచ్చే ఈ డిసీజ్ వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు కొన్ని అవయవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

డయాబెటిస్ ఉన్నట్టు కన్ఫర్మ్ అయిన వాళ్లు రోజువారీ లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా డైట్‌ మార్చుకోవాలి. చిన్నపాటి ఎక్సర్‌‌సైజులు మొదలుపెట్టాలి. వీటితోపాటు కొన్ని అవయవాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

రక్తనాళాలు

శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు రక్త సరఫరా వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నప్పుడు చిన్న గాయం అయినా అది ప్రమాదకరంగా మారొచ్చు. కాబట్టి వీలైనంత వరకు గాయాలు తగలకుండా జాగ్రత్తపడాలి.

చిగుళ్లు

డయాబెటిస్ ఉన్నవాళ్లకు నోటిలో చిగుళ్లుకు సరిగా రక్తం అందదు. దానివల్ల చిగుళ్లు పలుచబడడం, చిగుళ్ల వెంట రక్తస్రవం, నోటి దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చిగుళ్లను బలహీనంగా మార్చే వేడి ఆహారాలు, గట్టి పదార్ధాలు తీసుకోకూడదు. సుతిమెత్తని బ్రష్‌తో పళ్లు తోముకోవాలి.

గుండె

షుగర్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల రక్త సరఫరాలో మార్పులొచ్చి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి మేలు చేసే నట్స్, కాయగూరల వంటి ఆహారాలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.

కిడ్నీలు

డయాబెటిస్ ఉన్నవాళ్లలో కిడ్నీలకు కావలసినంత రక్తం సరఫరా అవ్వదు. దీనివల్ల కిడ్నీలు బలహీనపడే అవకాశం ఉంది. అందుకే షుగర్ పేషెంట్లకు తరచూ మూత్రవిసర్జన రావడం, చేతులు, కాళ్లు వాయడం వంటివి జరుగుతాయి. కాబట్టి కిడ్నీపై అధిక భారం పడేలా కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోకూడదు. నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

కాళ్లు

డయాబెటిస్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి రక్తనాళాలు డ్యామేజ్ అవుతుంటాయి. దీనివల్ల కొంతమంది అరికాళ్లలో రక్తసరఫరా సరిగ్గా జరగక కాళ్ల వాపు వస్తుంటుంది. అందుకే షుగర్ ఉన్నవాళ్లు రోజూ వాకింగ్, జాగింగ్ లాంటివి చేయాలి. అరికాళ్లలో రక్తప్రసరణ జరిగేలా మట్టిలో కాసేపు నడవాలి.

కళ్లు

శరీరంలో షుగర్ లెవల్స్ బాగా పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతిని కళ్లల్లో ఉండే సన్నని రక్తనాళాలు పాడయ్యి రెటీనా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

వీటితోపాటు రక్తప్రసరణను పెంచే పండ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. డాక్టర్లు సూచించిన డైట్‌ను తప్పక పాటించాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. తరచూ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటుండాలి. షుగర్ లెవల్స్ పెరిగి ఇతర శరీరభాగాలపై ఎఫెక్ట్ పడినప్పుడు డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags:    
Advertisement

Similar News