వానాకాలంలో వేడి వేడిగా..

డ్రైఫ్రూట్స్‌ చాట్, ఉడికించిన వేరుశ‌నక్కాయలు కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన స్నాక్ ఐటెమ్స్. ప్రొటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement
Update:2022-07-28 09:30 IST

వర్షం పడుతుంటే చాలామందికి వేడివేడి పకోడి, బజ్జీ లాంటివి తినాలనిపిస్తుంది. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే నూనెలో వేయించిన పదార్థాలకు బదులు వానాకాలానికి సూట్ అయ్యేలా హెల్దీ స్నాక్ ఐటమ్స్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వేడివేడి కార్న్

వర్షాకాలం సీజన్‌కు సరిగ్గా సరిపోయే స్నాక్.. వేడివేడి మొక్కజొన్న పొత్తులు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన స్నాక్‌. శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో ఇందులో ఉంటాయి. పైగా ఈవినింగ్ టైంలో తినడానికి ఈ స్నాక్ సరిగ్గా సరిపోతుంది. మొక్కజొన్న పొత్తుల్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు రక్తంలో షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

పాప్‌కార్న్‌

బయట వర్షం పడుతుంటే పాప్ కార్న్ తింటూ క్లైమెట్‌ను ఎంజాయ్ చేయడం బాగుంటుంది. కార్న్‌లో ఉండే పోషకాలన్నీ పాప్ కార్న్‌లో కూడా ఉంటాయి. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌, ప్రొటీన్లు ఉంటాయి. కార్న్‌లో ఉండే పీచు గుండె జబ్బులు, డయాబెటిస్‌, పలు రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా పాప్‌కార్న్‌తో బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

ఫ్రూట్స్

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్‌ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. నచ్చిన పండ్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని, వాటిపై కాస్త ఉప్పు-కారం చల్లుకొని నచ్చిన విధంగా స్నాక్ రెడీ చేసుకోవచ్చు. పండ్లలో కాయగూరలు కూడా కలిపి సలాడ్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. వానాకాలం స్నాక్స్‌లో ఫ్రూట్స్ మిస్ చేయొద్దు.

మరమరాలు

మరమరాలతో చేసే చాట్ మిక్చర్ కూడా వర్షంలో మంచి స్నాక్ ఆప్షన్. మరమరాలు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పల్లీలు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి మరమరాల చాట్‌ రెడీ చేస్తే ఈవినింగ్ టైంలో తినడానికి మంచి స్నాక్ రెడీ అవుతుంది. ఈ స్నాక్‌తో బరువు పెరిగుతామన్న భయం లేదు. పైగా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఇక వీటితో పాటు, డ్రైఫ్రూట్స్‌ చాట్, ఉడికించిన వేరుశ‌నక్కాయలు కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన స్నాక్ ఐటెమ్స్. ప్రొటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News