వర్షాకాలం ఎలర్జీలకు దూరంగా..
వర్షాకాలంలో చాలామందిని ఎలర్జీ సమస్య వేధిస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల కొంతమందిలో స్కిన్ ఎలర్జీలు, మరికొంతమందిలో గొంతు ఎలర్జీలు.. ఇలా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
వర్షాకాలంలో చాలామందిని ఎలర్జీ సమస్య వేధిస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల కొంతమందిలో స్కిన్ ఎలర్జీలు, మరికొంతమందిలో గొంతు ఎలర్జీలు.. ఇలా రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడమెలాగంటే..
వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఎలర్జీల్లో తలనొప్పి, ముక్కు దిబ్బడ, స్కిన్ ఇన్ఫెక్షన్లు ముఖ్యమైనవి. తరచూ తలనొప్పి రావడం, నరాలు బలహీనపడడం, ఆస్తమా, ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు, దురదలు వంటి లక్షణాలు వేధిస్తున్న వాళ్లు ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షాకాలపు ఎలర్జీలను పోగొట్టడానికి నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. ప్రతి రోజు నాలుగు లీటర్ల నీటిని తాగుతుంటే శరీరంలోని క్రిములు బయటకు వెళ్లిపోతుంటాయి. దీనివల్ల ముక్కు, స్కిన్ ఎలర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
వర్షాకాలంలో చల్లని పదార్ధాలు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం వంటి వాటిజోలికి వెళ్లకూడదు. ఇవి ఎలర్జీలను ఇంకా ఎక్కువ చేస్తాయి.
జలుబు, ముక్కు దిబ్బడ వేధిస్తున్నవాళ్లు జీలకర్ర, సోంపు, నువ్వులను వేగించుకుని భోజనం తర్వాత కొద్దిగా తీసుకోవాలి. ఈ మిశ్రమం ఎలాంటి అలర్జీలనైనా తొలగించడంలో సాయపడుతుంది. అలాగే రోజూ కొద్దిగా వేడి నీళ్లు తాగడం.. తేనె, నిమ్మరసం, అల్లం కలిపిన టీ తాగడం వంటివి చేయాలి.
వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండడం, ముక్కుకు మాస్క్ ధరించడం, దుమ్ము ధూళికి ఎక్స్‌పోజ్ కాకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలర్జీలు ఇంకా త్వరగా తగ్గుతాయి.
ఇకపోతే విటమిన్–బీ5, విటమిన్–ఈ డెఫీషియన్సీల వల్ల కూడా ఎలర్జీలు వస్తుంటాయి. కాబట్టి నాలుగైదు రోజులకు మించి ఎలర్జీ వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.