సీతాఫ‌లంతో అనేక ప్ర‌యోజ‌నాలు

కస్టర్డ్ ఆపిల్‌ సీజన్‌ వచ్చేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు.. సీతాఫలం అంటే ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండు టేస్ట్‌లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి.

Advertisement
Update:2024-10-09 18:19 IST

సీతాఫలం సీజన్ వచ్చిసింది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరు ఈ ఫ్రూట్ మార్కెట్లో దొరుకుతుంది. అయితే కస్టర్డ్ ఆపిల్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పండులో పుష్కలంగా ఉండే విటమిన్‌-సి, యాంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని నునుపుగా యవ్వనంగా ఉంచేందుకు, చర్మ కండరాలను బిగుతుగా ఉండేలా చూసేందుకు సాయపడతాయి. బిగుతుగా ఉండేలా చూసేందుకు సాయపడతాయి.ఇందులో ఉండే విటమిన్‌ బి6 మూడ్‌ బూస్టర్‌గా ఉపయోగపడుతుంది. దిగులు, కుంగుబాటు, ఒత్తిడిలాంటి వాటిని దూరం చేస్తుంది. ఈ ఫలంలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఒక కప్పు గుజ్జులో.. రోజువారీ తీసుకోవలసిన దాంట్లో 10 శాతం పొటాషియం, 6 శాతం మెగ్నీషియం ఉంటాయి. ఇవి గుండె కవాటాలను వెడల్పు చేసేందుకు తోడ్పడతాయి. సీతాఫలం గింజలను పొడిచేసి, చీమలు, బొద్దింకలు, బల్లులు, దోమల నివారణకు ఉపయోగిస్తారు. ఇక కంటి, గుండె ఆరోగ్యానికి కూడా సీతాఫలం ఎంతో మేలు చేకూరుస్తుంది.

కంటి చూపు మెరుగుప‌డ‌టంతో పాటు, గుండె, మెద‌డును ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. సీతాఫ‌లంలో సూక్ష్మ‌పోష‌కాలు పుష్క‌లంగా ల‌భించ‌డంతో.. చ‌ర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. మ‌న ర‌క్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు ,గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న మహిళలు ఈ పండును తినవచ్చు.సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

Tags:    
Advertisement

Similar News