బాడీ ట్యాపింగ్‌తో బోలెడు బెనిఫిట్స్!

సమయం లేనప్పుడు సులువుగా బాడీని యాక్టివేట్ చేసే బెస్ట్ టెక్నిక్ బాడీ ట్యాపింగ్. దీనివల్ల క్షణాల్లో శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు కండరాళ్లు, కీళ్లు కూడా రిలాక్స్ అవుతాయి.

Advertisement
Update: 2024-08-25 08:00 GMT

హెల్దీగా ఉండేందుకు వర్కవుట్లు, యోగా వంటివి చేస్తుంటారు చలామంది అయితే అంత తీరిక లేనివాళ్లు కేవలం బాడీ ట్యాపింగ్‌తో వ్యాయామం చేసినంత రిజల్ట్ పొందొచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే..

సమయం లేనప్పుడు సులువుగా బాడీని యాక్టివేట్ చేసే బెస్ట్ టెక్నిక్ బాడీ ట్యాపింగ్. దీనివల్ల క్షణాల్లో శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవ్వడంతోపాటు కండరాళ్లు, కీళ్లు కూడా రిలాక్స్ అవుతాయి. ఈ బాడీ ట్యాపింగ్ ఎలా చేయాలంటే..

ఇలా చేయాలి

బాడీ ట్యాపింగ్ అంటే శరీరం మొత్తాన్ని ట్యాప్ చేయడమే. ముందుగా అరికాళ్లో మొదలుపెట్టి తల వరకూ ట్యాప్ చేసుకుంటూ పోవాలి. అరికాళ్లు, మోకాళ్లు, మధ్యలోని కండరాలు, నడుము, వీపు భాగం, భుజాలు, చేతులు, అరచేతులు, మెడ భాగం, ముఖంపైన, తల పైన.. ఇలా శరీరమంతా ట్యాప్ చేయాలి. కీళ్ల వద్ద అంటే మోకాళ్లు, మోచేతులు, అండర్ ఆర్మ్స్ దగ్గర ఎక్కువ సార్లు ట్యాప్ చేయాలి. ఇలా చేసినప్పుడు చర్మం కాస్త ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఓవరాల్ బాడీని టాప్ టు బాటమ్ మూడు సార్లు ట్యాప్ చేయొచ్చు.

లాభాలివే..

బాడీ ట్యాపింగ్ వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే కీళ్ల దగ్గర బ్లాక్ అయిన రక్తం కూడా ఈజీగా ఫ్లో అవుతుంది. ఇలా శరీరమంతా ఫుల్‌గా రక్త ప్రసరణ జరుగుతుంది. బిగుతుగా ఉన్న కండరాలు, కీళ్లు రిలాక్స్ అవుతాయి. వ్యాయామాలు చేసేవాళ్లు కూడా వామప్ కింద బాడీ ట్యాపింగ్ చేసుకోవచ్చు. సమయం లేనప్పుడు ట్యాపింగ్‌తో సరిపెట్టొచ్చు.

Tags:    
Advertisement

Similar News