ఆ పచ్చని ఆకుతో జీవితం పదిలం
కొత్తమీరతో ఎన్నెన్ని ప్రయోజనాలో!
కొత్తమీర.. ప్రతి ఒక్కరు తమ ఆహారం తీసుకుంటారు. ఆహారానికి ఎంతో రుచిని ఇచ్చే ఈ పచ్చని ఆకు ఔషధంగానూ ప్రతి ఒక్కరి జీవితాలను పదిలం చేస్తుందట. అవును.. కొత్తమీరలో ఏ, బీ, సీ, కే విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కొత్తమీర ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్టప్ చేస్తుంది. యూరిన్ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.. కిడ్నీలను క్లీన్ చేస్తుంది. కొత్తమీర ఆకులు, ధనియాల్లోని విటమిన్ కే రక్తం గడ్డకట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎముకలు దృఢంగా ఉండేలా దోహదం చేస్తుంది. గుండె సంబంధ సమస్యలు, డిప్రెషన్, మలబద్దకం, షుగర్, అజీర్ణం, అంటువ్యాధులు, చర్మ సమస్యలపై పోరాడేందుకు కొత్తమీర ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను, బ్లడ్ ప్లెజర్ ను అదుపులో ఉంచుతుంది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు కొత్తమీర ఉపయోగపడుతుంది.