ప్రొబయాటిక్ థెరపీ గురించి తెలుసా?

ప్రొబయాటిక్స్‌ను ‘మంచి బ్యాక్టీరియా’ లేదా ‘సహాయక బ్యాక్టీరియా’ అంటారు. మామూలుగా బ్యాక్టీరియా అనగానే హానికరమైనవే అనుకుంటారు. కానీ, బ్యాక్టీరియాలో ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా ఉన్నాయి.

Advertisement
Update: 2024-08-28 07:30 GMT

మన శరీరంలోకి ఏదైనా హాని చేసే బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు శరీరం దానితో పోరాడలేదు. అందుకే యాంటీ బయాటిక్స్ సాయంతో వాటిని అంతం చేస్తాం. కానీ, రానురాను బ్యాక్టీరియా కూడా వాటి బలాన్ని పెంచుకున్నాయట. యాంటీ బయాటిక్స్‌కి లొంగనంత స్ట్రాంగ్‌గా తయారవుతున్నాయి. అందుకే ఇప్పుడు సైంటిస్టులు కొత్త వ్యూహం ఆలోచిస్తున్నారు. అదే ప్రో బయాటిక్స్. అంటే.. చెడు బ్యాక్టీరియాతో పోరాడే మంచి బ్యాక్టీరియాను మన శరీరంలోనే పెంచడం అన్నమాట.

ప్రొబయాటిక్స్‌ను ‘మంచి బ్యాక్టీరియా’ లేదా ‘సహాయక బ్యాక్టీరియా’ అంటారు. మామూలుగా బ్యాక్టీరియా అనగానే హానికరమైనవే అనుకుంటారు. కానీ, బ్యాక్టీరియాలో ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా ఉన్నాయి. యాంటీబయాటిక్స్‌ పనిచేయని పొజిషన్‌లో ప్రొబయాటిక్స్ థెరపీనే వాడాలని ‘డబ్ల్యూహెచ్‌ఓ’ కూడా చెప్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలో చాలామంది డాక్టర్లు పేషెంట్లకు ప్రొబయాటిక్ థెరపీనే సూచిస్తున్నారు.

గట్ హెల్త్

ప్రొబయాటిక్స్‌ జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి. మన శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైంది జీర్ణవ్యవస్థ. అదొక్కటి బాగుంటే.. శరీరమంతా బాగుంటుంది. అలాంటి జీర్ణవ్యవస్థను హెల్దీగా ఉంచడానికి ప్రొబయాటిక్స్‌ బాగా ఉపయోగపడతాయి.

క్యాన్సర్‌కు చెక్

శరీరంలో రోజూ కొన్ని లక్షల కణాలు చనిపోతూ, మళ్లీ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్‌లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొత్తకణాలు విషపూరితమై క్యాన్సర్ కణాలుగా మారతాయి. అయితే ప్రొబయాటిక్స్ తీసుకోవడం వల్ల కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా కాపాడుకోవచ్చు.

మెంటల్ హెల్త్‌

ప్రొబయాటిక్స్ వల్ల కొన్ని మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి. స్ట్రెస్ , డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సాధారణ సమస్యలతో పాటు బిహేవియరల్ ప్రాబ్లమ్స్‌ను కూడా తగ్గిస్తాయి. రోజూ వారీ డైట్‌లో ప్రొబయాటిక్స్‌ తీసుకుంటే, స్ట్రెస్‌ హార్మోన్స్‌ తగ్గి మనసు కుదుటపడుతుంది. హార్మోన్స్‌ను బ్యాలెన్స్‌గా ఉంచి, డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటాయి .

ఫుడ్స్ ఇవే..

ప్రొబయాటిక్స్ మనకు మూడు రకాలుగా దొరుకుతాయి. అవి పులిసిన వస్తువులు, పెరుగు, సప్లిమెంట్స్.. నేచురల్‌‌గా ప్రొబయాటిక్స్ లభించేది పెరుగు ద్వారా. రోజూ పెరుగు తినే వాళ్లకు జ్వరం, జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా వస్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. అలాగే పులిసిన పిండితో చేసే ఇడ్లీ, దోసెల్లాంటివి కూడా ప్రొబయాటిక్స్‌గానే పనిచేస్తాయి. వీటితో పాటు మొలకెత్తిన గింజలు, సోర్‌ క్రీం, కాటేజ్‌ చీజ్‌, టోఫూ, పులియబెట్టిన సోయా పాలు, -కిమ్చి( పులియబెట్టిన కూరగాయలు), ఊరగాయల్లో ప్రొబయాటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కాకుండా ప్రొబయాటిక్స్ క్యాప్సుల్‌, టాబ్లెట్ల రూపంలోనూ దొరుకుతాయి. వాటిని పొడి చేసుకుని నీళ్లు, జ్యూస్, పాలల్లో కలుపుకుని తాగొచ్చు.

Tags:    
Advertisement

Similar News