ఖాళీ కడుపుతో వ్యాయమం చేస్తే?

కండరాలు తేలిగ్గా కదలడానికి, కొవ్వు వేగంగా కరగడానికి ఆహారం తీసుకోకుండా ఎక్సర్‌సైజ్‌ చేయడం ఉత్తమం అంటున్న ఆరోగ్య నిపుణులు

Advertisement
Update:2024-12-04 15:08 IST

పొద్దున్నే వ్యాయామం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే ఖాళీ కడుపుతో ఎక్సర్‌సైజ్‌ చేస్తే చేస్తే ఇంకా లాభాలుంటాయంటున్నారు. ఖాళీ కడుపుతో వ్యాయమం చేస్తే.. శరీరం శక్తి కోసం పేరుకున్న కొవ్వును వినియోగించుకుంటుంది. దీనిద్వారా కొలెస్ట్రాల్‌ కరుగుతుందంటున్నారు.

టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్నవారు ఆహారం తీసుకోకుండా వ్యాయమం చేస్తే రక్తం ఇన్సులిన్‌ స్థాయులు పెరిగి షుగర్‌ అదుపులో ఉంటుంది. పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే హార్మోన్ల సమతుల్యత అవసరమని సూచిస్తున్నారు. పరగడుపున వ్యాయమం చేస్తే కొవ్వును కరిగించి, కండరాలు పెరగడానికి హార్మోన్లు సాయపడుతాయన్నారు. మెటబాలిజం ఆరోగ్యంగా ఉండటంతో పాటు పొట్టలోని కండరాలు తేలిగ్గా కదలడానికి, కొవ్వు వేగంగా కరగడానికి ఆహారం తీసుకోకుండా ఎక్సర్‌సైజ్‌ చేయడం ఉత్తమమని చెబుతున్నారు.

ఆకలిని పెంచే గ్రెలిన్‌ హార్మోన్‌ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే అదుపులో ఉంటుంది. ఆకలి ఎక్కువగా వేయదు. కేలరీలను అదుపు చేయడానికి ఇదో మార్గం. వేగంగా నడవడం, కార్డియో జాగింగ్‌ వంటివి ఆహారం తీసుకోకుండా చేస్తే శరీర భాగాలకు రక్తసరఫరా వేగవంతం అవుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఎడ్రినలిన్‌, ఎండ్రోఫిన్స్‌ హార్మోన్లస్థాయి పెరుగుతుంది. దీంతో పని మీద దృష్టి సారించగలరు. ఉత్సాహంగానూ ఉంటారు.

గమనిక: మీ ఆరోగ్యం, మీ శరీర బరువు తగ్గట్టు ఏ వ్యాయామం బాగుంటుంది అనేది.. ఫిట్‌నెస్‌ నిపుణలను సంప్రదించి తెలుసుకునిన ఎక్సర్‌సైజ్‌ చేయగలరు. 

Tags:    
Advertisement

Similar News