షుగర్ తింటే షుగర్ వస్తుందా?
సింపుల్ గా చెప్పాలి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటున కూడా చక్కెరను ఉపయోగించకూడదు. చక్కెర కు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమమైనవి.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కవ మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీనిని చెప్పవచ్చు. ఒక్కసారి వచ్చిందంటే ఇక అంతే. తగ్గడం అంటూ ఉండదు. నోరు కట్టేసుకుని ఉంటే కాస్త అదుపులో ఉంటుంది. లేదంటే శరీరంలో విచ్చలవిడిగా చక్కెరస్థాయులు పెరిగిపోతాయి. దీనివల్ల పాదాల నుంచి మొదలుపెడితే మెదడు వరకు ప్రతి అవయవం దెబ్బతింటుంది.
అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెర అనగానే భయపడిపోతుంటారు. చక్కెర అధికంగా తీసుకోవడం వల్లే డయాబెటిస్ వస్తుందని బాగా నమ్ముతుంటారు. షుగర్‌ను ఒక శత్రువులా చూస్తుంటారు.
బరువు పెరగడానికి షుగర్ కారణమని భావిస్తుంటారు. వాస్తవానికి చక్కెర విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర, జన్యువులు, వయస్సు, శరీర బరువు, పీసీఓఎస్, శారీరక శ్రమ స్థాయిలు టైప్-2 మధుమేహానికి ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. కేవలం షుగర్ తింటే డయాబెటిస్ వస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. అయితే డయాబెటిస్ వచ్చిన వాళ్లు షుగర్ తీసుకుంటే ఆ లెవల్స్ మరింత పెరుగుతాయని వద్దని డాక్టర్స్ సూచిస్తుంటారు.
శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదల కాకపోవడం మధుమేహానికి ప్రధాన కారణం. సాధారణంగా ఇన్సులిన్ శరీరంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. కానీ ఎప్పుడైతే శరీరానికి సరిపడ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదో అప్పుడు శరీరంలో చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి.
సింపుల్ గా చెప్పాలి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో తీపి కోసం పొరపాటున కూడా చక్కెరను ఉపయోగించకూడదు. చక్కెర కు ప్రత్యామ్నాయాలుగా బెల్లం మరియు తేనె ఉత్తమమైనవి. ఈ రెండూ ఆహారానికి తీపిని తెస్తాయి కానీ శరీరానికి హాని కలిగించవు. చక్కెర స్థాయిని పెంచవు. అలాగే డయాబెటిస్ ఉన్న ఎవరైనా సరే పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆహారాల్లో పీచు పదార్థం ఉండేలా జాగ్రత్త పడాలి. రోజూ తగినన్ని గంటల పాటు నిద్ర, కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఎప్పటికప్పుడు లిపిడ్ ఫ్రొఫైల్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లు చేయించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారి అయినా సరే కళ్లు, పాదాలను పరీక్ష చేయించుకోవాలి.