ప్రొటీన్ పౌడర్లు మంచివేనా?

జిమ్‌కు వెళ్లే చాలామంది మజిల్ బిల్డింగ్ కోసమని ప్రొటీన్ పౌడర్లు తీసుకుంటుంటారు. అలాగే బరువు పెరగాలి అనుకునేవాళ్లు, కండలు పెంచాలనుకునేవాళ్లు కూడా ప్రొటీన్ సప్లిమెంట్స్‌ తీసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉంటారు.

Advertisement
Update:2023-11-02 11:41 IST

ప్రొటీన్ పౌడర్లు మంచివేనా?

జిమ్‌కు వెళ్లే చాలామంది మజిల్ బిల్డింగ్ కోసమని ప్రొటీన్ పౌడర్లు తీసుకుంటుంటారు. అలాగే బరువు పెరగాలి అనుకునేవాళ్లు, కండలు పెంచాలనుకునేవాళ్లు కూడా ప్రొటీన్ సప్లిమెంట్స్‌ తీసుకుంటే మంచిదన్న ఆలోచనలో ఉంటారు. అసలీ పౌడర్లు ఎంత వరకూ మంచివి? న్యూట్రిషనిస్టులు ఏమంటున్నారు?

మజిల్ బిల్డింగ్ ట్రెండ్‌గా మారినప్పటినుంచి ప్రొటీన్ పౌడర్లు, ఇతర ప్రొటీన్ సప్లిమెంట్లు పాపులర్ అయ్యాయి. వర్కవుట్స్ చేసిన తర్వాత కండ పట్టాలంటే వేప్రొటీన్ వంటివి తీసుకోవాలని జిమ్ ట్రైనర్లు కూడా సలహా ఇస్తుంటారు. వీటి గురించి నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రొటీన్ సప్లిమెంట్స్‌లో వేప్రొటీన్, మిక్స్‌డ్ ప్రొటీన్, ఎగ్ ప్రొటీన్, హెంప్ ప్రొటీన్.. ఇలా చాలా రకాలున్నాయి. వీటిలో వేప్రోటీన్‌ను ఎక్కువమంది తీసుకుంటారు. ఇదొక డెయిరీ ప్రొడక్ట్ ఇందులో మిల్క్ బేస్డ్ ప్రొటీన్ ఉంటుంది. మిక్స్‌డ్ ప్రొటీన్ పౌడర్‌‌లో రకరకాల వనరుల నుంచి తీసిన ప్రొటీన్స్ ఉంటాయి. ఎగ్ ప్రొటీన్ కేవలం గుడ్డు నుంచి తయారుచేస్తారు. హెంప్ ప్రొటీన్ అంటే ఆకుల నుంచి తయారుచేసేది. అయితే వర్కవుట్స్ తర్వాత మజిల్స్ త్వరగా రికవర్‌ కావడానికి ఇవి హెల్ప్ చేసే మాట నిజమే అయినా.. వీటిని తీసుకునేవాళ్లు కొన్ని ఇతర విషయాలు కూడా గుర్తుంచుకోవాలి.

సాధారణంగా రోజువారీ ఆహారంలో భాగంగా పప్పులు, గుడ్లు తినేవాళ్లకు రోజువారీ ప్రొటీన్ అవసరాలు తీరతాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ ప్రత్యేకంగా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ వర్కవుట్స్ చేస్తు్న్నవాళ్లు, అథ్లెట్లు.. వాళ్ల ట్రైనర్ల సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవచ్చు. రోజువారీ డైట్‌లో ప్రొటీన్ ఉండట్లేదు అనుకునేవాళ్లు ఒకట్రెండు స్పూన్ల వేప్రొటీన్ తీసుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు.

ట్రైనింగ్‌లో భాగంగా ప్రొటీన్స్ ఎక్కువగా తీసుకోవాలనుకునేవాళ్లు గుడ్లు, ఉడికించిన పప్పులతో ప్రొటీన్ పొందొచ్చు. ఇది హెల్దీ ఆప్షన్. అలాగే మాంసం, చేపలు వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే క్యాలరీలు లేకుండా అచ్చంగా ప్రొటీన్ కావాలనుకుంటే వేప్రొటీన్, హెంప్ ప్రొటీన్ వంటివి మంచి ఆప్షన్స్. ఇవి మజిల్ బిల్డిండ్ చేసేవాళ్లకు, అథ్లెట్లకు బాగా సూట్ అవుతాయి. ఒకవేళ ప్రొటీన్ డెఫీషియన్సీ ఉంటే అప్పుడు శరీర తీరుని బట్టి డాక్టర్ల సలహా మేరకుప్రొటీన్ రకాన్ని ఎంచుకోవాలి.

కొన్ని ప్రొటీన్ సప్లిమెంట్స్‌లో ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్, షుగర్స్ వంటివి కూడా కలుస్తాయి. ఎక్కువకాలం పాటు వీటిని తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన స్టడీలో తేలింది. ఏదేమైనా పదార్థాల నుంచి ఆర్టిఫీషియల్ పద్ధత్తుల్లో ఎక్స్‌ట్రాక్ట్ చేసిన ప్రొటీన్స్ కంటే గింజలు, గుడ్లు, మాంసం, పాలలో ఉండే సహమైన ప్రొటీన్లతో లాభం ఎక్కువ అనేది నిపుణుల సలహా.

Tags:    
Advertisement

Similar News