ఇవి తింటే చర్మం వయసైపోయినట్టు కనిపిస్తుంది!

చర్మ సౌందర్యం కోసం పైపైన ఎంత కేర్ తీసుకున్నా.. చర్మం లోపలి నుంచి జరగాల్సిన నష్టం జరిగితే ఏమీ చేయలేం. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయిన చర్మంలా తయారు చేస్తాయి.

Advertisement
Update:2024-08-03 08:44 IST

చర్మాన్ని అందంగా కాపాడుకోవడం కోసం చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే స్కిన్ హెల్త్ అనేది పైపైన వాడే ప్రొడక్ట్స్ మీద కంటే లోపలి నుంచి ఇస్తున్న పోషణపై ఎక్కువ ఆధారపడుతుంది. కాబట్టి ఫుడ్ ద్వారా స్కిన్ హెల్త్‌ను కాపాడుకోవాలి.

చర్మ సౌందర్యం కోసం పైపైన ఎంత కేర్ తీసుకున్నా.. చర్మం లోపలి నుంచి జరగాల్సిన నష్టం జరిగితే ఏమీ చేయలేం. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌తో చర్మానికి చాలా ప్రమాదముంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని పాడుచేసి, వయసైపోయిన చర్మంలా తయారు చేస్తాయి. ఆ ఫుడ్స్ ఏంటంటే..

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే షుగర్స్, సాల్ట్స్, యాసిడ్స్ ఇవన్నీ డెంటల్ హెల్త్‌ను పాడు చేయడంతో పాటు, వీటిలో ఉండే..హై కెఫిన్, సోడియం కంటెంట్ శరీరాన్ని లోలోపల డీహైడ్రేట్ చేస్తాయి. చర్మాన్ని పాడుచేసేవాటిలో డీహైడ్రేషన్ కూడా ఒకటి. అందుకే వీటిని తరచూ తీసుకోవడం వల్ల వయసైపోయినట్టు కనిపిస్తారు.

బేక్డ్ ఫుడ్స్

బేక్డ్ ఫుడ్స్‌లో షుగర్, ఫ్యాట్స్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఎక్కువగా తినడం వల్ల చర్మం త్వరగా పాడైపోతుంది. అలాగే బేకింగ్ కోసం వాడే చాలా పదార్థాలు ఏజింగ్ ప్రాసెస్‌ను స్పీడ్ చేస్తాయి. దాంతో చర్మం త్వరగా వయసైపోయినట్టు కనిపిస్తుంది.

హై షుగర్

షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌.. బరువు పెరగేలా చేయడంతోపాటు చర్మం వదులుగా తయారయ్యేలా చేస్తాయి. అలాగే షుగర్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో గ్లైకేషన్ జరుగుతుంది. గ్లైకేషన్ అంటే శరీరంలోని గ్లైకోజ్ ప్రొటీన్స్‌తో కలిసి బైండ్ అయ్యే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ వల్ల చర్మం అందాన్ని కోల్పోతుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్ మోతాదు ఎక్కువైతే ఆ ఎఫెక్ట్ వెంటనే స్కిన్‌పై చూపిస్తుంది. ఆల్కహాల్‌తో కళ్లు, చర్మం ఎంతగానో పాడవుతాయి. ఆల్కహాల్ వల్ల లివర్ పాడయ్యి అది టాక్సిన్స్‌ను శుద్ధి చేయడం మానేస్తుంది. దాంతో చర్మంలోని టాక్సిన్స్ అన్నీ అలాగే ఉండిపోయి, చర్మంలోని సాగేగుణం దెబ్బతిని వయసైపోయినట్టు కనిపిస్తుంది.

చిప్స్, ఫ్రైడ్ ఫుడ్స్

మార్కెట్‌లో దొరికే పొటాటో చిప్స్‌, రెస్టారెంట్లలో చేసే ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఇంకా వాడిన నూనెలను వాడుతుంటారు. వీటి వల్ల శరీరంలో రాడికల్ డ్యామేజ్ లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో గుండె, చర్మం ఎంతగానో ఎఫెక్ట్ అవుతాయి. అందుకే రెస్టారెంట్స్‌లో వీలైనంత వరకూ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం మంచిది.

ప్రాసెస్డ్ మీట్

నిల్వ చేసిన, ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాగే ప్రాసెస్డ్ మాంసం శరీరంలో విటమిన్– సి ను తగ్గిస్తుంది. దాంతో చర్మంలో కొల్లాజెన్ ఫార్మేషన్ తగ్గుతుంది. అలా చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది. అందుకే ప్రాసెస్డ్ మీట్‌కు బదులు తాజా మాంసం, కూరగాయలు తింటే మంచిది.

హెల్దీ ఫ్యాట్స్ లేకపోతే..

వీటితో పాటు హెల్దీ ఫ్యాట్స్ తక్కువైనప్పుడు కూడా చర్మం వయసైపోయిట్టు కనిపిస్తుంది. చాలామంది ఫ్యాట్ తింటే బరువు పెరుగుతారనే భయంతో అసలు ఫ్యాట్ జోలికే వెళ్లరు. కానీ ఫ్యాట్స్‌లో అవకాడోస్, ఆల్మండ్స్, కొబ్బరి నూనె లాంటి హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి. చర్మంలో సరైనమోతాదులో కొవ్వునిల్వలు ఉంటేనే అది తాజాగా కనిపిస్తుంది. లేకపోతే కుచించుకుపోయి. వయసు మీద పడ్డట్టు కనిపిస్తుంది.

Tags:    
Advertisement

Similar News