ఇలా చేస్తే నెల రోజుల్లో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వొచ్చు!
మానసికంగా దృఢంగా మారాలంటే దేన్నయినా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండాలంటున్నారు నిపుణులు.
మానసిక కుంగుబాటు, ఒత్తిడి, యాంగ్జైటీ వంటి పలు సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఒత్తిడితో కూడిన లైఫ్‌స్టైల్, పని, చుట్టూ ఉండే మనుషులు.. ఇలా రకరకాల కారణాల చేత మానసికంగా బలహీనపడిపోతుంటారు. ఇలాంటి వాళ్లు మెంటల్లీ స్ట్రాంగ్‌గా మారాలంటే ఈ టిప్స్ పాటించాలి.
మానసికంగా దృఢంగా మారాలంటే దేన్నయినా యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండాలంటున్నారు నిపుణులు. సమస్య అయినా, ఛాలెంజ్ అయినా దేన్నైనా అంగీకరించడం ద్వారా ధైర్యం, సామర్ధ్యం పెంపొందించుకోవచ్చు. ఈ తరహా యాటిట్యూడ్‌తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
జీవితంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటే ఒత్తిడి ఉండదనేది నిపుణుల మాట. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటే సమస్యలను ఈజీగా ఎదుర్కోవచ్చు.
ఫెయిల్ అవుతామేమో అన్న భయం నుంచి బయటకు రావడమే సక్సెస్ అనేది గొప్పవాళ్లు చెప్పేమాట. కాబట్టి ఫెయిల్యూర్ గురించిన భయం లేకపోతే.. ఇక ఒత్తిడి, డిప్రెషన్‌కు తావే లేదు.
ఒత్తిడికి లోనయ్యే చాలామంది విక్టిమ్ మైండ్ సెట్‌తో ఉంటారు. అంటే దానివల్ల నాకు ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు. కానీ, ప్రతి విషయంలో నాదంటూ కొంత బాధ్యత ఉంది అని చూస్తే డిప్రెషన్, ఒత్తిడి వంటివి ఉండవు.
గతాన్ని ఊరికే తవ్వుతూ కూర్చోవడం వల్ల కూడా డిప్రషన్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి నిన్నటి గురించి ఆలోచనే లేకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి. వర్తమానంలో జీవిచడం ద్వారా ఒత్తిడి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. మీపై మీకు గౌరవం ఉంటే ప్రతిదానికీ మిమ్మల్ని మీరు నిందుచుకోవడం తగ్గుతుంది. మానసికంగా దృఢంగా ఉండొచ్చు.