ఇవన్నీ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు!

శరీర డిఎన్‌ఏలో కలిగిన మార్పుల కారణంగా కొన్ని కణాలు మ్యుటేషన్ చెంది క్యాన్సర్ సెల్స్‌గా మారతాయి. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే.. ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు.

Advertisement
Update:2023-07-11 15:00 IST

ఇవన్నీ క్యాన్సర్ ముందస్తు లక్షణాలు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. మనదేశంలో గుండె జబ్బుల తర్వాత క్యాన్సర్‌ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. అయితే ప్రమాదకరమైన క్యాన్సర్‌ని ఫస్ట్ స్టేజీలోనే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. మరి క్యాన్సర్‌ను ముందే గుర్తించడమెలా?

సింపుల్‌గా చెప్పాలంటే శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరగడాన్నే క్యాన్సర్ అంటారు. శరీర డిఎన్‌ఏలో కలిగిన మార్పుల కారణంగా కొన్ని కణాలు మ్యుటేషన్ చెంది క్యాన్సర్ సెల్స్‌గా మారతాయి. క్యాన్సర్‌ను ముందు దశలో గుర్తిస్తే.. ప్రమాదాన్ని కొంతవరకూ తగ్గించొచ్చు. క్యాన్సర్ రావడానికి ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవెలా ఉంటాయంటే..

- రోజూ అలసటగా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. పెద్ద పేగు క్యాన్సర్‌, లుకేమియా క్యాన్సర్‌లు వచ్చే ముందు అలసట ప్రధానమైన లక్షణంగా కనిపిస్తుంది.

- ఏ కారణం లేకుండా ఒకేచోట నొప్పి ఏర్పడినా, ఎన్ని చికిత్సలు చేయించుకున్నా నొప్పి తగ్గకపోతున్నా.. దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. అలాగే శరీరంలో ఎక్కడైనా వాపు కనిపించినా, గడ్డలు లాంటివి ఏర్పడినా అవి క్యాన్సర్‌‌కు సంబంధించినవి కావొచ్చు.

- తరచూ చర్మం ఎర్రబడుతున్నా, చిన్న చిన్న మచ్చలు, పులిపిర్లు వంటివి వస్తుంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి. అలాంటి లక్షణాలు చర్మ క్యాన్సర్‌‌కు సంబంధించినవి కావొచ్చు.

- ఆగకుండా దగ్గు వస్తున్నా, ఉన్నట్టుండి బరువు తగ్గుతున్నా, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు తరచూ వస్తున్నా.. ఓసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

- క్యాన్సర్ లక్షణాలను గమనించి సమయానికి ట్రీట్మెంట్ మొదలుపెడితే ప్రాణాపాయ పరిస్థితుల నుంచి గట్టెక్కే వీలుంటుంది.

Tags:    
Advertisement

Similar News