పిల్లల ఫోన్ అడిక్షన్‌ను తగ్గించండిలా!
మొబైళ్లు లేనిరోజుల్లో పిల్లలు ఖాళీ దొరికితే బయటకు పోయి ఆడుకునేవాళ్లు. కానీ, ఇప్పుడా ఆటలు లేవు. రోజంతా మొబైల్ పట్టుకుని కూర్చునే పిల్లలు ఎక్కువయ్యారు. చిన్న పిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకూ అందరిదీ ఇదే పరిస్థితి. మరి ఇలాంటి పిల్లలను మార్చేదెలా? పిల్లల స్క్రీన్ టైంను తగ్గించేదెలా?
మొబైళ్లు లేనిరోజుల్లో పిల్లలు ఖాళీ దొరికితే బయటకు పోయి ఆడుకునేవాళ్లు. కానీ, ఇప్పుడా ఆటలు లేవు. రోజంతా మొబైల్ పట్టుకుని కూర్చునే పిల్లలు ఎక్కువయ్యారు. చిన్న పిల్లల నుంచి టీనేజ్ పిల్లల వరకూ అందరిదీ ఇదే పరిస్థితి. మరి ఇలాంటి పిల్లలను మార్చేదెలా? పిల్లల స్క్రీన్ టైంను తగ్గించేదెలా?
ఈ సెలవుల్లో చాలామంది పిల్లలు మొబైల్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. పిల్లలకు ఇలా చిన్న వయసు నుంచే మొబైల్ అలవాటు చేయడం వల్ల చాలా నష్టాలుంటాయంటున్నారు నిపుణులు. మొబైల్స్‌కు అడిక్ట్ అయిన పిల్లల్లో మానసిక ఎదుగుదల, మెదడు పనితీరు దెబ్బతింటుందని పలు అధ్యయానాల్లో తేలింది. కాబట్టి పేరెంట్సే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదెలాగంటే..
పిల్లలు మారాం చేసినప్పుడు వారిని బుజ్జగించేందుకు ఫోన్ చేతికిచ్చే అలవాటు మానుకోవాలి. చేతికి ఫోన్ ఇస్తే కుదురుగా కూర్చుంటారు అనే ధోరణి మంచిది కాదు. కాబట్టి ఈ తరహా అలవాటుని మానుకోవాలి.
పిల్లల మొబైల్ అడిక్షన్‌ను తగ్గించాలంటే ఇంట్లో మిగతావాళ్లు కూడా మొబైల్ పట్టుకోవడం తగ్గించాలి. పెద్దవాళ్లు వాడకపోతే పిల్లలు కూడా మొబైల్ అడగరు. అంతగా మొబైల్ వాడాల్సి వస్తే వారి కంట పడకుండా చూసుకోవడం మంచిది.
పిల్లల మనసుని మార్చాలంటే వారికి నచ్చేలా మరేదైనా యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. దానికోసం బొమ్మలు, క్రాఫ్ట్స్ వంటివి ఇవ్వొచ్చు. లేదా ఇతర ఆటలు అలవాటు చేయొచ్చు.
పిల్లలను బయటకు పంపడం అలవాటు చేస్తే మొబైల్ అడిక్షన్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. బయటకు తీసుకువెళ్లడం లేదా ఇతర పిల్లలతో ఆడుకునేలా ఏర్పాట్లు చేస్తే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఇంట్లో పేరెంట్స్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటే పిల్లలకు ఏమీ తోచక మొబైల్ వైపు చూస్తారు. అలాకాకుండా పిల్లలతో తగిన సమయం గడపడం వారితో ఆటలు ఆడడం, కథలు చెప్పడం లాంటివి చేస్తుంటే మొబైల్ మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది.
సెలవుల్లో పిల్లలను ఇతర యాక్టివీటీస్ నేర్చుకునేలా అలవాటు చేస్తే మొబైల్ అడిక్షన్‌కు ఛాన్స్ ఉండదు. పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ వంటి క్లాసుల్లో జాయిన్ చేస్తే వారిలో క్రియేటివిటీ, డిసిప్లిన్ పెరుగుతాయి.