స్క్రీన్ ఎక్కువసేపు చూస్తున్నారా? కళ్లను ఇలా రిలాక్స్ చేయండి!

డిజిటల్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడడం, తగినంత నిద్ర లేకపోవడం, తక్కువ లైటింగ్‌లో పని చేయడం వంటి కారణాల వల్ల కళ్లు త్వరగా అలసిపోయి, అసౌకర్యానికి లోనవుతుంటాయి.

Advertisement
Update:2024-07-01 06:00 IST

మిగతా అవయవాలతో పోలిస్తే కళ్లు త్వరగా అలసిపోతుంటాయి. కళ్లు అత్యంత సున్నితమైన అవయవాలు కావడమే దీనికి కారణం. దీనికితోడు చాలామంది రోజంతా మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌పై గడుపుతుంటారు. దీంతో కళ్లు మరింత ఒత్తిడికి లోనవుతున్నాయి. మరి ఏరోజుకారోజు కళ్లను రీఫ్రెష్ చేయాలంటే ఏం చేయాలి?

డిజిటల్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడడం, తగినంత నిద్ర లేకపోవడం, తక్కువ లైటింగ్‌లో పని చేయడం వంటి కారణాల వల్ల కళ్లు త్వరగా అలసిపోయి, అసౌకర్యానికి లోనవుతుంటాయి. తద్వారా కంటి నొప్పితో పాటు కళ్ల కింద వలయాలు కూడా ఏర్పడతాయి. ఇలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలతో కళ్లపై పడే ఒత్తిడి తగ్గించొచ్చు. అదెలాగంటే.

తగినంత నిద్రపోవడం ద్వారా కళ్లపై పడే ఒత్తిడిని సహజంగానే తగ్గించొచ్చు. రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్రతో కళ్లు పూర్తిగా రిలాక్స్ అవుతాయి.

ల్యాప్‌టాప్ లేదా సిస్టమ్‌పై ఎక్కువసేపు పనిచేసేవాళ్లు ఇరవై నిముషాలకోసారి స్క్రీన్ వైపు నుంచి దృష్టిని మరల్చాలి. అలాగే కళ్లను తరచూ బ్లింక్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది.

వర్క్ చేసుకునే ప్లేస్‌లో వెళుతురు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. స్క్రీన్ లైటింగ్ కంటే బయట లైటింగ్ ఎక్కువగా ఉంటే కళ్లపై ఒత్తిడి పడదు.

అలసిపోయిన కళ్లను రిలాక్స్ చేయడం కోసం కీరా ముక్కలు బాగా పనికొస్తాయి. ప్రతిరోజూ పడుకునేముందు ఇరవై నిముషాలపాటు కళ్లపై కీరా ముక్కలుపెట్టుకుంటే కళ్లు రిలాక్స్ అవ్వడంతో పాటు నిద్రకూడా మంచిగా పడుతుంది.

కళ్లు బాగా అలసిపోయి ఎరుపెక్కినప్పుడు కలబంద గుజ్జుతో కళ్లను రీఫ్రెష్ చేయొచ్చు. కలబంద గుజ్జుని కంటి చుట్టూ రాసి పడుకోవడం ద్వారా కంటి చుట్టూ కండరాలు రిలాక్స్ అవ్వడంతో పాటు కంటి కింద వలయాలు కూడా తగ్గుతాయి.

ఇకపోతే ప్రతిరోజూ రోజ్ వాటర్‌‌తో కళ్లను కడుక్కోవడం ద్వారా కంటిలో ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. కళ్లు మరింత ఆరోగ్యంగా ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News