థైరాయిడ్ తగ్గేదెలా?

మనిషి శరీరంలో అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తిందంటే అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంటుంది. నిజానికి మనకు వచ్చే జ్వరాలు, రకరకాల నొప్పులు, అలసట, నీరసం వంటివి సాధారణంగా వచ్చేవి కావు.

Advertisement
Update:2023-10-04 08:51 IST

థైరాయిడ్ తగ్గేదెలా?

మనిషి శరీరంలో అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తిందంటే అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంటుంది. నిజానికి మనకు వచ్చే జ్వరాలు, రకరకాల నొప్పులు, అలసట, నీరసం వంటివి సాధారణంగా వచ్చేవి కావు. శరీరంలో ఏదో సమస్య తలెత్తితే కన్పించే లక్షణాలే. ఆ లక్షణాల్ని బట్టి ఆ సమస్య ఏంటో గుర్తించగలిగితే సకాలంలో చికిత్స సాధ్యమౌతుంది. థైరాయిడ్ సమస్యను కూడా సకాలంలో గుర్తించగలగాలి. ఎందుకంటే ధైరాయిడ్ మన శరీరంలో కలిగించే మార్పులను చాలామంది గుర్తించేసరికే థైరాయిడ్ వ్యాధి ముదిరిపోతుంది.

థైరాయిడ్ అనేది ఓ గ్రంధి. మనిషి శరీరంలో మెడ భాగంలో లోపల సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమైన హార్మోన్ల విడుదల ఈ గ్రంథి చేసే పని. ఈ గ్రంథిలో సమస్య ఏర్పడితే హార్మోన్ల విడుదలపై ప్రభావం పడి..వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే శరీరంలోని వివిధ రకాల పనుల్ని నియంత్రించేది థైరాయిడ్.


ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకుంటే థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే సమస్యను సరిచేయవచ్చు. థైరాయిడ్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏయే పదార్ధాలు తీసుకోవాలో, ఏవి తీసుకోకూడదో తెలుసుకుందాం..

యాపిల్‌లో ఉండే పేక్టిన్ అనే ఫైబర్ థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. రోజూ యాపిల్ తినడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. అలాగే ధైరాయిడ్ సమస్యకు చెక్ చెప్పాలంటే మరో అద్భుతమైన ఆహారం బ్రౌన్ రైస్. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన సెలేనియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

బాదం, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ వంటివి వారంలో కనీసం 4-5 సార్లు తీసుకోవటం, తినే ఆహారంలో పెరుగును తప్పక చేర్చడం కూడా థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

అయితే కాలిఫ్లవర్, క్యాబేజి ల్, బ్రోకలి, అరటి వంటి క్రూసిఫెరోస్ కూరగాయలకు థైరాయిడ్ రోగులు దూరంగా ఉండాలి. ఇవి మీ సమస్యను మరింత పెంచుతాయి. అలాగే గ్లూటెన్ అనేది థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. అందుకే గ్లూటెన్ ఉండే పదార్ధాలను డైట్‌కు దూరంగా ఉంచడం మంచిది. రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం చేయడమే కాకుండా ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలి. వీటి అన్నింటితో పాటు కొంతకాలం పాటు డాక్టర్ నిర్దేశించిన థైరాయిడ్ టాబ్లెట్ ను వేసుకోవడం ద్వారా మాత్రమే థైరాయిడ్ ని అదుపులో పెట్టుకోగలరు.

Tags:    
Advertisement

Similar News