యూరిన్ ఇన్ఫెక్షన్ బాధను ఇలా తగ్గించొచ్చు!

చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యలో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. దీన్నే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)’ అని కూడా అంటారు.

Advertisement
Update:2023-12-27 14:45 IST

చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యలో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. దీన్నే ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)’ అని కూడా అంటారు. మూత్రంలో మంట, నొప్పి వంటివి ఇందులో ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడొచ్చంటే..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది మహిళల్లో అత్యంత సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్. మనదేశంలో సుమారు 50 శాతం మహిళలు దీన్ని ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారని స్టడీలు చెప్తున్నాయి. అయితే ఇది చలికాలంలో మరింత ఎక్కువ అవుతుంది. అందుకే దీనికై తగిన జాగ్రత్తలుతీసుకోవడం ముఖ్యం.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరమైనది కానప్పటికీ ఇది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. తరచూ యూరిన్ సెన్సేనష్ కలగడం, యూరిన్‌లో మంట, నొప్పి, కడుపు నొప్పి వంటివి ఇందులో సాధారణంగా కనిపించే లక్షణాలు. ఇది పగటికంటే రాత్రిళ్లు ఎక్కువ సంభవిస్తుంటుంది. దీంతో నిద్రకు డిస్టర్బెన్స్ కలుగుతుంది.

చలికాలంలో డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది. ఇలాంటి నొప్పి లేదా మంట కలిగినప్పుడు ఎక్కువ నీళ్లు తాగాలి. పగటి పూట కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్ల వంటివి తీసుకుంటూ యూరిన్ ఫ్లో సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా బ్యాక్టీరియా దానంతట అదే బయటకు వెళ్లిపోతుంది.

బెర్రీస్ పండ్లు ఈ తరహా ఇన్ఫెక్షన్స్‌ను త్వరగా తగ్గిస్తాయి. ముఖ్యంగా క్రాన్‌బెర్రీ పండ్లు యూరిన్ ఫ్లోని పెంచుతాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్–సీ మూత్ర నాళాల్లో వ్యాపించిన బ్యాక్టీరియా/ పూతను తగ్గించడంలో సాయపడుతుంది. బెర్రీస్‌తో పాటు నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తీసుకోవచ్చు.

సిట్రస్ ఫ్రూట్స్, టీ, కాఫీలు, కూల్‌డ్రింక్స్, మసాలాలు, ఆల్కహాల్ వంటివి యూరిన్ ఇన్ఫెక్షన్ మంటను పెంచుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీటిని తీసుకోకపోవడం మంచిది.

శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలగించడానికి ప్రోబయోటిక్స్ కూడా సాయపడతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.

ఇన్పెక్షన్ ఉన్నప్పుడు తరచూ నీళ్లు తాగుతూ వీలైనన్ని ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లేలా చూసుకోవాలి. మూత్రాన్ని ఆపుకునే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే పగటి పూట ఎక్కువ నీళ్లు తాగుతూ.. రాత్రిళ్లు నీటి శాతాన్ని తగ్గి్స్తే.. నిద్రకు ఆటంకం కలగకుండా చూసకోవచ్చు.

మూత్రంలో మంట, నొప్పి వంటి లక్షణాలు మూడు, నాలుగు రోజులైనా తగ్గకపోతుంటే వెంటనే డాక్టర్‌‌ను సంప్రదించాలి. సరైన యాంటీ బయాటిక్స్ వాడడం ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు కూడా ఈ తరహా ఇన్ఫెక్షన్‌కు దారి తీయొచ్చు. కాబట్టి నొప్పి ఎక్కువ అవుతుంటే డాక్టర్‌‌ను కలవడం మంచిది.

Tags:    
Advertisement

Similar News