స్మోకింగ్ మానేయాలా? ఇవి ట్రై చేయండి!

సరదాకి స్మోకింగ్ మొదలుపెట్టి తర్వాత దాన్ని వదల్లేక ఇబ్బంది పడుతున్నవాళ్లు ఇటీవల ఎక్కువవుతున్నారు. చిన్న వయసులోనే స్మోకింగ్‌కు అలవాటైతే అన్నిరకాల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే.

Advertisement
Update:2023-10-18 12:44 IST

సరదాకి స్మోకింగ్ మొదలుపెట్టి తర్వాత దాన్ని వదల్లేక ఇబ్బంది పడుతున్నవాళ్లు ఇటీవల ఎక్కువవుతున్నారు. చిన్న వయసులోనే స్మోకింగ్‌కు అలవాటైతే అన్నిరకాల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ వంటివే కాకుండా గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, బీపీ, ఆస్తమా వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే స్మోకింగ్ ను వీలైనంత త్వరగా మానుకునే ప్రయత్నం చేయాలి. స్మోకింగ్ మానేసి డైట్‌లో కొన్ని ఆహారాలు చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులను వెంటనే డీటాక్స్ చేసుకోవచ్చు.

ముందుగా స్మోకింగ్ మానాలనుకున్న వాళ్లు వ్యసనాన్ని మానుకోవడం కోసం చూయింగ్ గమ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. లేదా స్మోక్ చేయాలనిపించినప్పుడల్లా ఏదైనా హెర్బల్ టీ తాగడాన్ని అలవాటు చేసుకోవచ్చు.

చాలామంది ఒత్తిడి వల్ల స్మోకింగ్ చేస్తుంటారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించే సహజమైన మార్గాలను ట్రై చేయాలి. ప్రాణాయామం, మెడిటేషన్ వంటివి ట్రై చేయొచ్చు. స్విమ్మింగ్ లేదా ఏవైనా ఆటలను హాబీగా మార్చుకోవచ్చు.

రోజూ ఏదోఒక రూపంలో అల్లం తీసుకోవడం వల్ల నికోటిన్ కోరికలను తగ్గుతాయని స్టడీలు చెప్తున్నాయి. అలాగే సిట్రస్ ఫ్రూట్స్, దాల్చిన చెక్క, లవంగం, హెర్బల్ టీలు వంటివి తీసుకోవడం ద్వారా కూడా స్మోకింగ్ కోరికను తగ్గించొచ్చట. అంతేకాదు, స్మోకింగ్ మానేయాలనుకునేవాళ్లు ఆల్కహాల్, మీట్, స్పైసీ ఫుడ్స్, కాఫీ వంటివాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఇవి తీసుకోవడం వల్ల స్మోక్ చేయాలన్న కోరిక మరింత పెరుగుతుందట.

ఇక స్మోకింగ్ మానేసి లంగ్స్‌ను డీటాక్స్ చేయాలనుకునేవాళ్లు రోజువారీ డైట్‌లో విటమిన్–సీ ఉండేలా చూసుకోవాలి. విటమిన్–సీ ఇమ్యూనిటీని పెంచి లంగ్స్‌ను క్లీన్ చేయడంలో సాయపడుతుంది.

స్మోకింగ్ వల్ల బాడీ సెల్స్‌కు ఏర్పడిన డ్యామేజీని రికవరీ చేయడానికి విటమిన్లు ఎక్కువ తీసుకోవాళి. క్యారెట్, బ్రొకలీ, ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే రక్తాన్ని శుద్ధి చేసే దానిమ్మ, బీట్‌రూట్, క్యారెట్ వంటివి కూడా తీసుకుంటుండాలి.

ఎంత ట్రై చేసినా స్మోకింగ్ మానలేకపోతున్నవాళ్లు కౌన్సెలింగ్ సాయం తీసుకుంటే వీలైనంత త్వరగా దాన్నుంచి బయటపడొచ్చు.

Tags:    
Advertisement

Similar News