సమ్మర్‌లో కూరగాయలు పాడవ్వకుండా..

సమ్మర్ సీజన్‌లో వాతావరణంలో ఉండే వేడి కారణంగా ఇంట్లో తెచ్చి పెట్టుకునే కూరగాయలు, పండ్ల వంటివి చాలా త్వరగా పాడైపోతుంటాయి.

Advertisement
Update:2024-03-15 09:00 IST

సమ్మర్ సీజన్‌లో వాతావరణంలో ఉండే వేడి కారణంగా ఇంట్లో తెచ్చి పెట్టుకునే కూరగాయలు, పండ్ల వంటివి చాలా త్వరగా పాడైపోతుంటాయి. అందుకే ఈ సీజన్‌లో వాటిని ప్రత్యేకంగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. అదెలాగంటే..

పండ్లు, కాయగూరల వంటివి వారానికి సరిపడా ఒకేసారి కొనేస్తారు చాలామంది. ఇలాంటప్పుడు పదార్థాలు సరిగ్గా నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

పచ్చిగా ఉంటే..

రోజువారీ వంటల్లో ఉపయోగించే టమాటాలు ఈ సీజన్‌లో త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని కొనేటప్పుడు పచ్చిగా ఉన్నవి ఎంచుకోవాలి. పచ్చిగా ఉన్నవి కొని, కాస్త రంగు మారాక ఫ్రిజ్‌లో పెడితే పాడవ్వకుండా ఉంటాయి.

బ్యాగ్స్

పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు జిప్పర్ బ్యాగ్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. పండ్లు లేదా కూరగాయలను తెచ్చిన వెంటనే జిప్పర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువకాలం పాటు పాడవ్వకుండా ఉంటాయి.

మట్టి పాత్రలో

ఫ్రిజ్ వాడని వాళ్లు కూరగాయలు, పండ్లను సంచుల్లో నిల్వ ఉంచేబదులు మట్టి పాత్రల్లో నిల్వ ఉంచితే పాడవ్వకుండా ఉంటాయి. అలాగే పండ్లు, కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే ఉప్పుతో కడిగి నిల్వ చేస్తే పుచ్చిపోకుండా ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి.

ఇవి ఫ్రిజ్ లో వద్దు

బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, అరటి పండ్ల వంటివి ఫ్రిజ్‌లో కంటే గది ఉష్ణోగ్రత వద్దే మంచిగా నిల్వ ఉంటాయి. వీటిని మట్టి పాత్రలు లేదా గాలి చొరబడే బుట్టల్లో నిల్వ ఉంచొచ్చు. వడబడుతున్నాయి అనుకుంటే తడిపిన బట్టను కప్పొచ్చు. అలాగే చాలామంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి.

ఇకపోతే యాపిల్స్‌, జర్బూజా వంటి పండ్ల నుంచి ఇథిలిన్‌ అనే వాయువు రిలీజ్ అవుతుంది. కాబట్టి వీటిని మిగతా కాయగూరలతో కలిపి ఉంచకూడదు. అలాగే ఈ సీజన్‌లో ఆహారం చెడిపోకుండా వంటగిదిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.

Tags:    
Advertisement

Similar News