వర్షాకాలం కంఫర్ట్ కోసం ఇలా చేయండి!

వర్షాకాలంలో కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ సీజన్‌లో బట్టలు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ.. ఇలా అన్నింటిని స్పెషల్‌గా ఎంచుకోవాలి.

Advertisement
Update:2024-08-21 09:15 IST

వర్షాకాలంలో బయటకెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ బట్టలు, వస్తువులు తడిచిపోతాయో అన్న భయం అందరికీ ఉంటుంది. అందుకే వర్షాకాలం వేసుకునే బట్టల పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వర్షాకాలంలో కంఫర్టబుల్‌గా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలుతీసుకోవాలంటే..

వర్షాకాలంలో కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ సీజన్‌లో బట్టలు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ.. ఇలా అన్నింటిని స్పెషల్‌గా ఎంచుకోవాలి.

వర్షాకాలంలో ఎప్పుడూ వెంట ఓ గొడుగు తీసుకెళ్తే అత్యవసర పరస్థితుల్లో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో టైట్ ఫిట్‌లకు బదులు వదులుగా ఉండే బట్టలు ఎంచుకుంటే మంచిది. అలాగే ఈ సీజన్‌లో జీన్స్‌ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే అవి తడిస్తే ఆరేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

ఇక పుట్‌వేర్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో లెదర్, క్లాత్ బిల్ట్ షూలకు బదులు ప్లాస్టి్క్ బిల్ట్, జెల్లీ మెటీరియల్ ఉండే షూస్ బెటర్. అలాగే ఈ సీజన్‌లో జారి పడకుండా మంచి గ్రిప్ ఉండే చెప్పులు, షూస్ వేసుకోవాలి. అలాగే వెంట ఉంచుకునే యాక్సెసరీస్ కూడా వర్షానికి పాడవ్వకుండా చూసుకోవాలి. వాటర్‌ప్రూఫ్స్‌ వాచ్‌లు, లెదర్ వాలెట్లు వాడితే మంచిది.

వీటితోపాటు ఈ సీజన్‌లో మొబైల్‌.. ల్యాప్‌ట్యాప్స్‌ వంటివి తడవకుండా వాటర్‌ఫ్రూఫ్ కవర్లు వెంట ఉంచుకుంటే మంచిది. అలాగే బ్యాగ్‌కు కూడా వాటర్ ప్రూఫ్ కవర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే తల తడవకుండా ఒక లెదర్ క్యా్ప్ లేదా ఇతర వాటర్ ప్రూఫ్ మెటిరియల్ క్యాప్ కూడా వెంట ఉంచుకుంటే మంచిది.

Tags:    
Advertisement

Similar News