కిడ్నీలో రాళ్లు గుర్తిద్దామిలా..

ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు సాధారణ సమస్యగా మారింది. ఖనిజాలు, సోడియం మూత్రపిండాల్లో పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి.

Advertisement
Update:2024-06-04 22:00 IST

శరీరానికి వచ్చే ఏ వ్యాధినైనా ముందస్తుగా గుర్తిస్తే సులువుగా నయం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ ముప్పు పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు సాధారణ సమస్యగా మారింది. ఖనిజాలు, సోడియం మూత్రపిండాల్లో పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇవి చాలా నొప్పిని , అసౌకర్యాన్ని కలిగిస్తాయి. చాలామంది సమస్యను ముందుగా గుర్తించకపోవడంతో శస్త్రచికిత్సల వరకు వెళ్లాల్సి వస్తోంది. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే ముందుగా ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

మూత్రంలో రక్తం రావడం కిడ్నీలో రాళ్లు ఉన్నయనడానికి సంకేతం. దీన్ని హెమటూరియా అని పిలుస్తారు. ఈ సమయంలో మూత్రం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు.కొన్ని సందర్భాల్లో రక్త కణాలు మైక్రోస్కోప్‌ లేకుండా చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. అప్పుడు వైద్యుడు మూత్రాన్ని పరీక్షించి రక్తం ఉందా లేదా అని నిర్ధారిస్తారు. కొందరికి మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. కిడ్నీని , మూత్రాశయాన్ని కలిపే ట్యూబ్ మధ్య కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఈ నొప్పి ఉంటుంది. దీన్ని డైసూరియా అని పిలుస్తారు.

 

కిడ్నీ స్టోన్స్‌తో బాధపడేవారిలో వికారం, వాంతులు వంటి సాధారణ లక్షణాలు ఉండవచ్చు. ఈ లక్షణాలు మూత్రపిండాలు, జీర్ణశయాంతర (GI) నాళాల మధ్య పరస్పర అనుసంధానమైన నరాల వల్ల కలుగుతాయి. ఫలితంగా పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే విపరీతమైన నొడుము నొప్పి ఉంటుంది. ఈ నొప్పి బొడ్డు, పొత్తి కడుపు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నొప్పి కారణంగా నిలబడలేరు సరికదా నడవడం కూడా కష్టంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రం చిక్కగా, దుర్వాసనతో ఉంటుంది. యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జ్వరం కూడా తరచూ వస్తుంది. దాదాపు 100.4 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్‌ ఉంటుంది.

ఈ లక్షణాలన్నీ గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.

 

Tags:    
Advertisement

Similar News