వంట నూనెలో కల్తీ ఎలా గుర్తించొచ్చంటే..

కల్తీ అనేది ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఆహార కల్తీ వల్ల చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కల్తీ నూనెల ఎఫెక్ట్ ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది.

Advertisement
Update:2022-11-03 15:26 IST

మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. నూనె లేనిది వంట చేయడం కుదరదు. అందుకే వంట నూనె ధరలు ఎంత పెరిగినా సామాన్యులు వాటిని కొనక తప్పదు. దీన్ని అదనుగా చేసుకుని ఈ మధ్య కాలంలో కల్తీ నూనెలు మార్కెట్లో హడావిడి చేస్తున్నాయి. తక్కువ ధరకు దొరికే కొన్నిరకాల కల్తీ నూనెలు జనాన్ని అనారోగ్యాల బారిన పడేస్తున్నాయి. అందుకే దీనిపై 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా' కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..

కల్తీ అనేది ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఆహార కల్తీ వల్ల చాలామంది వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కల్తీ నూనెల ఎఫెక్ట్ ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం వాడే నూనెలో కల్తీ ఉందా..? లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్‌ వల్ల వంటల్లో నూనె కల్తీదా..? కాదా? అనేది తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను 'ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా' ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

వంటనూనెల్లో 'ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌' అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం లాంటి రోగాలకు దారితీస్తుంది. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా రెండు మి.లీ. నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను వేయాలి. కొద్దిసేపటి తర్వాత పాత్రలోని నూనె రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన నూనె అని గుర్తించాలి. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లు లెక్క.

Tags:    
Advertisement

Similar News