అలవాట్లను మార్చుకోలేకపోతున్నారా? ఇలా చేసి చూడండి!
మనలో చాలామంది కొత్తగా కొన్ని మంచి అలవాట్లు మొదలుపెట్టాలనుకుంటారు. లేదా కొన్ని చెడు అలవాట్లు మానేయాలనుకుంటారు. కానీ, కొంతకాలం ట్రై చేసి మధ్యలో వదిలేస్తుంటారు. అయితే.. కొత్తగా ఏదైనా పనిని అలవాటుగా మార్చుకోవాలంటే దానికి కొంత ప్లానింగ్ అవసరం.
మనలో చాలామంది కొత్తగా కొన్ని మంచి అలవాట్లు మొదలుపెట్టాలనుకుంటారు. లేదా కొన్ని చెడు అలవాట్లు మానేయాలనుకుంటారు. కానీ, కొంతకాలం ట్రై చేసి మధ్యలో వదిలేస్తుంటారు. అయితే.. కొత్తగా ఏదైనా పనిని అలవాటుగా మార్చుకోవాలంటే దానికి కొంత ప్లానింగ్ అవసరం. అదెలా ఉండాలంటే..
ముందుగా కొత్త హ్యాబిట్ మీరు ఎందుకు అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో మీకు పూర్తి క్లారిటీ ఉండాలి. ఆ హ్యాబిట్ వల్ల మీరు పొందబోయే బెనిఫిట్స్‌ను సరిగ్గా అంచనా వేసుకుని డెసిషన్ తీసుకోవాలి.
కొత్త అలవాటును మొదలుపెట్టాక దాన్ని ఎలా అమలుచేస్తున్నారో మీకు మీరే ట్రాక్ చేసుకోవాలి. అందులో సక్సెస్ అవుతున్నప్పుడు మిమ్మల్ని మీరే అభినందించుకోవాలి. అలాగే ఒక కొత్త విషయాన్ని మన మెదడు అర్థం చేసుకుని అలవాటు చేసుకోడానికి టైం పడుతుంది. కాబట్టి తొందరపడొద్దు. అలవాటు మానుకోవడం లేదా అలవాటు చేసుకోవడం అనేది ముఖ్యం. కానీ, ఎంత తొందరగా అనేది ముఖ్యం కాదు.
కొత్త అలవాటుని సింపుల్‌గా మొదలుపెట్టాలి. మెల్లగా ఇంప్రూవ్ అవుతూ పోవాలి. దేన్నీ బలవంతంగా చేయొద్దు. ఉదాహరణకు సిగరెట్ మానుకోవాలనుకుంటుంటే.. ముందు సిగరెట్ల సంఖ్య తగ్గించడంతో మొదలుపెట్టాలి. అలా క్రమంగా తగ్గిస్తూ మెల్లగా మానేసేవరకూ వెళ్లాలి. మధ్యలో ఆగిపోకూడదు.
ఉన్న అలవాటుని మానుకోవాలన్నా, కొత్త అలవాటు చేసుకోవాలన్నా.. ముందుగా అడ్డుపడేది మనసే. కాబట్టి మనసుని అధిగమించాలి. మసను తనకు నచ్చిన పాత క్రమంలోనే ఉండమని టెంప్ట్ చేస్తుంటుంది. ఆ టెంప్టేషన్‌ను అధిగమిస్తే సగం సక్సెస్ అయినట్టే.
కొంతకాలం ట్రై చేసి.. ‘మానుకోలేకపోతున్నాను’ అని గివప్ ఇచ్చేయొద్దు. అనుకున్నదానికే కట్టుబడి ఉండండి. ఓపికగా చేస్తూ ఉండండి. మెల్లగా అదే అలవాటవుతుంది. కొత్తగా చేయాలనుకుంటున్న పనికి సంబంధించిన పోస్టర్లు లేదా స్టిక్కర్లు రోజూ తిరిగే చోట అతికించడం వల్ల ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండే వీలుంటుంది.
అలవాట్లు మార్చుకోవడం గురించి ఫ్రెండ్స్‌కి చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది. మీరు దారి తప్పుతున్నప్పుడు వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది.