సమ్మర్‌‌లో రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి?

సమ్మర్‌‌లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం అవసరం. అలాగని మరీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా అంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు.

Advertisement
Update:2024-04-11 06:30 IST

సాధారణంగా రోజుకి మూడు నాలుగు లీటర్ల నీటిని తాగితే మంచిదని డాక్టర్లు చెప్తుంటారు. అయితే సమ్మర్‌‌లో ఉండే హీట్ కారణంగా మరిన్ని ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుందా? అసలు సమ్మర్‌‌లో రోజుకి ఎన్ని నీళ్లు తాగాలి? ఈ విషయాలపై డాక్టర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

సమ్మర్‌‌లో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం అవసరం. అలాగని మరీ ఎక్కువ నీళ్లు తాగడం కూడా అంత మంచిది కాదంటున్నారు డాక్టర్లు. రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి అనేది వ్యక్తిని బట్టి మారుతుంటుందంటున్నారు.

సాధారణంగా మనిషికి రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీరు అవసరం అవుతుంది. అయితే వ్యక్తి చేసే శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటర్ ఇన్‌టేక్‌లో మార్పులు చేసుకోవచ్చు. రోజంతా బయట తిరిగే వ్యక్తులు, శారీరక శ్రమ చేసే వ్యక్తులు వారి శ్రమను బట్టి నాలుగైదు లీటర్ల వరకూ నీటిని తీసుకోవచ్చు. అలాకాకుండా రోజంతా ఏసీలో కూర్చొని పనిచేసేవారు అన్ని నీళ్లు తాగాల్సిన అవసరం లేదు.

సమ్మర్‌‌లో తగినన్ని నీళ్లు తాగడంతోపాటు తీసుకునే ఆహారంలో కూడా వాటర్ కంటెంట్ ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. కాయగూరలు, పండ్లు, జ్యూస్‌ల వంటివి ఎక్కువగా తీసుకునేవాళ్లు నీళ్లు కాస్త తక్కువ తాగినా ఇబ్బంది ఉండదు.

వ్యాయామాలు, శారీరక శ్రమ చేసేవాళ్లు, చెమట పట్టేలా పనిచేసేవాళ్లు, గంటకోసారి నీళ్లు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండడం మంచిది. లేదా దాహం వేసినప్పుడల్లా రెండు గ్లాసుల నీటిని తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు నీటి శాతాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూరిన్ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు కాస్త ఎక్కువ నీటిని తీసుకోవాలి. అలాగే కిడ్నీ సమస్యలున్నవారు మరీ ఎక్కువ నీటిని తాగకూడదు. ఇలా తమ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంత నీరు తాగాలో డాక్టర్ల సలహా తీసుకుంటే మంచిది.

Tags:    
Advertisement

Similar News