మనం రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగొచ్చు?

కాఫీ టీలలో కెఫిన్ ఉంటుందని, అది పరిమితిని మించి శరీరంలోకి వెళితే ఆరోగ్యానికి హాని జరుగుతుందని... మనలో చాలామందికి తెలుసు. అయితే రోజుకి ఎంత స్థాయిలో కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవచ్చు.

Advertisement
Update:2023-08-08 08:45 IST

మనం రోజుకి ఎన్ని కప్పులు కాఫీ తాగొచ్చు?

కాఫీ టీలలో కెఫిన్ ఉంటుందని, అది పరిమితిని మించి శరీరంలోకి వెళితే ఆరోగ్యానికి హాని జరుగుతుందని... మనలో చాలామందికి తెలుసు. అయితే రోజుకి ఎంత స్థాయిలో కెఫిన్ ఉన్న పానీయాలను తీసుకోవచ్చు. ఎంతకు మించితే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది... ఈ విషయాలను తెలుసుకుందాం

కెఫిన్ ఉన్న పానీయాలను అధికంగా తీసుకున్నపుడు మన శరీరంలో యూరిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. అయితే కెఫిన్ ఉన్న పానీయాలను తాగినప్పుడు వాటిలోని నీటిశాతం కెఫిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కెఫిన్ శరీరంలోకి వెళ్లినప్పుడు శరీరంలో మూత్రం ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంది. కెఫిన్ ఉన్న పానీయాలు తాగే అలవాటు లేనివారు ఒక్కసారిగా వాటిని తాగినప్పుడు ఇలాంటి ప్రభావం కనిపించవచ్చు. కాఫీ టీలతో పాటు సోడా, ఎనర్జీ డ్రింకులు, హాట్ చాక్ లేట్, సప్లిమెంట్లు మొదలైనవాటిలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఉన్న డ్రింకులను తాగేటప్పుడు తప్పకుండా వాటి లేబుల్ ని పరిశీలించాలి. దీనివలన సురక్షితమైన స్థాయిలో మాత్రమే కెఫిన్ ని తీసుకునే అవకాశం ఉంటుంది.

ఇంతకీ ఎంత మోతాదు కెఫిన్ సురక్షితం...

అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ సూచనలను బట్టి రోజుకి పెద్దవాళ్లు 400 మిల్లీ గ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదు. రెండేళ్లు అంతకంటే తక్కువ వయసున్న పిల్లలకు కెఫిన్ ఉన్న పానీయాలను తాగించకూడదు. టీనేజి వరకు పిల్లలకు కెఫిన్ ఉన్న పానీయాలను ఇవ్వకూడదని పిల్లల వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 12 నుండి 18 ఏళ్ల లోపు వయసు వారు రోజుకి 100 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ ఉన్న పానీయాలు తాగటం మంచిది కాదు. అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లులు కూడా కెఫిన్ ఉన్న పానీయాల విషయంలో వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

ఎన్ని కప్పుల కాఫీ...

సాధారణంగా మనం తాగే ఒక కప్పు కాఫీలో 80నుండి 100 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. అలాగే పలురకాల శీతల పానీయాల్లో కెఫిన్ 40 నుండి 50 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. దీనిని బట్టి మనం కాఫీ టీలు, ఇతర కెఫిన్ ఉన్న పానీయాలు ఎంతవరకు తీసుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఒక కేజీ శరీర బరువుకి పది మిల్లీ గ్రాముల వరకు కెఫిన్ తీసుకుంటే దానిని చాలా ఎక్కువ మోతాదుగా చెప్పవచ్చు. ఇది తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 75 కిలోల బరువు ఉంటే ఆ వ్యక్తి 750 మిల్లీగ్రాముల కెఫిన్ ని పానీయాల ద్వారా తీసుకుంటే అది చాలా ఎక్కువ మోతాదు కింద లెక్క. ఇలాంటప్పుడు ఛాతీ నొప్పి, క్రమబద్ధంగా లేని గుండెలయ, స్ట్రోక్ లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కెఫిన్ ని పరిమితికి మించి తీసుకున్నపుడు చాలామందిలో నిద్రలేమి, విరేచినాలు, పొట్టలో ఇబ్బందులు లాంటి సమస్యలు కనబడుతుంటాయి. రోజుకి నాలుగువందల మిల్లీగ్రాములు లేదా అంతకంటే తక్కువ మాత్రమే కెఫిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది కనుక రోజుకి నాలుగు లేదా ఐదు కప్పులకు మించి కాఫీని తీసుకోవటం మంచిది కాదు.

తగిన మోతాదు కెఫిన్ మంచిదే....

కెఫిన్ ని తగిన మోతాదులో తీసుకోవటం వలన అనేకరకాల అనారోగ్యాలను నివారించవచ్చని అధ్యయనాల్లో తేలింది. రెండు నుండి ఐదు కప్పుల కాఫీని తీసుకోవటం వలన గుండెవ్యాధులు, టైప్ టు మధుమేహం, లివర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్లు, పార్కిన్సన్స్, డిప్రెషన్ లాంటి వ్యాధులను తప్పించుకోవచ్చని, పరిమితి దాటిన కెఫిన్ ఆరోగ్యంపైన వ్యతిరేక ప్రభావం చూపుతుందని పరిశోధకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News