తల దురదని ఇలా దూరం పెడదాం..
సాధారణంగా తలలో దురద పెట్టడం అనేది చాలా కామన్ విషయం. చాలా మంది ఈ సమస్యతో బాధ పడే ఉంటారు.
సాధారణంగా తలలో దురద పెట్టడం అనేది చాలా కామన్ విషయం. చాలా మంది ఈ సమస్యతో బాధ పడే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ లో .. ఇది చెప్పుకోవాల్సినంత పెద్ద విషయం కాదూ.. వదిలేయాల్సినంత చిన్న సమస్య కూడా కాదు. ఇంట్లో దురద పెడితే సరే గోక్కుంటే పోతుంది. కానీ.. బయటకు ఉద్యోగానికి, ఇతర పనుల నిమిత్తం వెళ్లినప్పుడు అస్తమానూ తల గోక్కుంటే చూశావారికీ , మనకి కూడా చిరాకుగానే ఉంటుంది. తలలో దురద రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
స్కాల్ఫ్ పొడి బారిపోవడం, పీహెచ్ స్థాయిల్లో మార్పులు రావడం, చుండ్రు, చెమట, తలపై వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల తలలో దురద వస్తుంది. ఈ దురద సమస్యను వదిలించుకోవడానికి ఆయిల్స్, షాంపూలను వాడే ఉంటారు. కానీ వీటితో సమస్య తగ్గడం సంగతి అటు ఉంచితే.. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి తలపై దురద సమస్యతో బాధ పడేవారు ఈ సారి ఇంటి చిట్కాలు ఉపయోగించండి. వీటి వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పొడి స్కాల్ప్ సమస్యలకు పెరుగు మేలు చేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 3-4 చెంచాల పెరుగు తీసుకుని అందులో 2 చెంచాల అలోవెరా జెల్ , ఒక చెంచా తేనె కలపాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి జుట్టు , తలకు పట్టించాలి. సుమారు అరగంట తర్వాత కడగాలి.
ఒక్క కలబంద గుజ్జు అప్లై చేసినా కూడా మాడుకు హైడ్రేషన్ అందుతుంది. అలాగే దురద కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
తల దురద నుండి ఉపశమనానికి, మీరు పెరుగు,మెంతులతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడానికి మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఈ గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా పెరుగు కలుపుకోవాలి. దీన్ని మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించి అరగంట తర్వాత మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల తల దురద నుండి ఉపశమనం లభిస్తుంది.
టీ ట్రీ, పుదీనా, వేప, జోజోబా ఆయిల్స్ వాడటం వల్ల దురద తగ్గడంతో పాటు.. జుట్టు కుదళ్లకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలడం తగ్గి.. జుట్టు పెరుగుతుంది. పోషకాలు కూడా చక్కగా అందుతాయి.
చివరిగా తలలో దురద సమస్యతో ఇబ్బంది పడేవారు ఇతరులు ఉపయోగించే దిండ్లు, దువ్వెలను ఉపయోగించవచ్చు. వీటి వల్ల వారికి కూడా దురద సమస్య, చుండ్రు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.