జుట్టు జిడ్డుగా మారుతోందా?

తలపై చర్మంలో నూనె గ్రంధులు ఎక్కువవడం, చుండ్రు పెరగడం లాంటి కారణంగా మాడు వెంటనే జిడ్డుబారుతుంటుంది. దీనివల్ల వెంట్రుకలు రాలడం ఎక్కువవుతుంది.

Advertisement
Update:2022-10-13 18:17 IST

సాధారణంగా తలస్నానం చేసిన కొద్దిరోజుల తర్వాత జుట్టు క్రమంగా జిడ్డుగా మారుతుంటుంది. కానీ కొందరిలో వెంటనే మాడు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టులో జిడ్డు మొదలవుతుంది. దీన్నెలా తగ్గించాలంటే..

తలపై చర్మంలో నూనె గ్రంధులు ఎక్కువవడం, చుండ్రు పెరగడం లాంటి కారణంగా మాడు వెంటనే జిడ్డుబారుతుంటుంది. దీనివల్ల వెంట్రుకలు రాలడం ఎక్కువవుతుంది. అందుకే తలకు జిడ్డు పేరుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

విపరీతమైన కాలుష్యం, నూనె ఆధారిత షాంపూ, కండిషనర్‌లను వాడడం వల్ల జిడ్డు సమస్య ఎక్కువ అవ్వొచ్చు. అందుకే ఒకసారి షాంపూ, కండిషనర్ లను మార్చి చూడాలి. తలను పొల్యూషన్ కు ఎక్స్ పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.

జిడ్డు సమస్య ఉన్నవాళ్లు వారానికి రెండు, మూడుసార్లు తప్పక తలస్నానం చేయాలి. కండిషనర్‌ని మాడుకి కాకుండా వెంట్రుకలకు మాత్రమే పరిమితం చేయాలి.

జుట్టు త్వరగా ఆరాలని హెయిర్‌ డ్రయ్యర్‌ ఉపయోగిస్తుంటారు చాలామంది. దీనివల్ల కూడా జిడ్డు పెరుగుతుంది. కాబట్టి జుట్టుని టవల్ తో మాత్రమే తుడుచుకోవాలి. డ్రయ్యర్లు, బ్రష్ లు, హెయిర్ స్ట్రైటెనింగ్ లాంటివాటికి దూరంగా ఉండాలి.

షాంపూకి బదులు కుంకుడు, శీకాకాయ వంటివాటిని ఉపయోగిస్తే జిడ్డు సమస్య తగ్గుతుంది. అలాగే తలస్నానం తర్వాత ఒక మగ్గు నీటిలో పావుకప్పు యాపిల్ సైడర్‌ వెనిగర్‌ కలిపి తలకు పట్టిస్తే జుట్టు పొడిగా ఉంటుంది.

ఇక వీటితోపాటు పెరుగు, టీట్రీఆయిల్‌, లవంగ నూనె వంటివి తరచూ పెట్టినా జిడ్డు, చుండ్రు లాంటివి తగ్గుతాయి. అలాగే నూనె పదార్థాలు తినడం కూడా తగ్గించాలి.

Tags:    
Advertisement

Similar News