భయపెడుతున్న ఫ్లూ కేసులు.. జాగ్రత్తలు ఇలా..

ఎండలు పెరుగుతున్న ఈ సీజన్ లో ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్‌ కారణంగా చాలామంది జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు.

Advertisement
Update:2023-03-08 14:58 IST

కొవిడ్ తరహా లక్షణాలున్న కొత్త ఇన్‌ఫ్లుయెంజా కేసులు గత వారం రోజులుగా భయపెడుతున్నాయి. ఎండలు పెరుగుతున్న ఈ సీజన్ లో ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్‌ కారణంగా చాలామంది జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ కొన్ని జాగ్రత్తలు సూచించింది అవేంటంటే..

గత కొన్ని రోజలుగా ‘హెచ్‌3ఎన్‌2 ’ రకం ఇన్ఫెక్షన్లతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. ఈ ఇన్ఫెక్షన్‌లో కోవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తాయి. ఎడతెరపి లేని దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలు ఇలా..

హెచ్‌3ఎన్‌2 ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తే.. మాస్క్‌ ధరించాలి. నోరు, ముక్కును పదే పదే తాకకూడదు.

ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దు. దగ్గుతున్నప్పుడు ముక్కు, నోటిని కవర్‌ చేసుకోవాలి.

వీటితోపాటు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.

కరచాలనం చేయడం, ఇతరులను తాకడాన్ని తగ్గించాలి. ఇతరులతో కలిసి తినడాన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది.

లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. సొంత ట్రీట్మెంట్లు చేసుకోకూడదు.

అయితే ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్ అంత ప్రాణాంతకమైనదేం కాదు. కానీ, శ్వాస సంబంధిత సమస్యలున్నవారికి కొంత రిస్క్ ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.

Tags:    
Advertisement

Similar News